మనిషి జీవితంలో పురోగతి సాధించడానికి గ్రంధాలలో అనేక మార్గాలు ఉన్నాయి.శాస్త్రంలో ఈ నియమాలను పాటించడం ద్వారా ఒక వ్యక్తి తన చెడు సమయన్ని కూడా మంచి కాలంగా మార్చుకోగల సామర్థ్యాన్ని పొందగలడనీ పండితులు చెబుతున్నారు.
అందుకే కొన్ని నిబంధనలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా మన జీవితంలో పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తాయి.
హిందూ మతంలో మహిళలను ఇంటి లక్ష్మీగా ప్రజలు భావిస్తారు.ఏ మహిళ తన ఇంటి పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపుతుందో కచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి( Goddess Lakshmi ) నివసిస్తుంది.
ఇక లక్ష్మీదేవి కొలువై ఉండే ఇంట్లో దానధాన్యాలకు అసలు లోటు ఉండదు.పురాణాల ప్రకారం మహిళలు ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శాస్త్రం ప్రకారం మహిళలు ఇంటి తలుపును కాలితో తనడం లేదా కాలితో తలుపును తాకడం ద్వారా అసలు తెరువకూడదు.ఇలా చేస్తే ఇంట్లో తల్లి లక్ష్మీదేవి ఎప్పుడు ప్రవేశించదు.ఆ ఇంటి సభ్యులు ఎప్పుడూ ఆర్థిక సమస్యలను( Financial problems ) ఎదుర్కొంటారు.ఎవరైనా మహిళలు ఇలాంటి తప్పులు చేస్తుంటే ఈ రోజే ఆ తప్పులు చేయడం మానేయాలని శాస్త్రం చెబుతోంది.
ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు గుమ్మం మీద కూర్చుని మాట్లాడడం, తినడం, ఇతర పనులు చేయడం నిషేధం అని చెబుతున్నారు.మహిళలు ఈ తప్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు.

మహిళలు ఇలా చెయ్యడం ఇంటి నాశనానికి దారి తీస్తుంది.అందుకే గుమ్మం మీద కూర్చుని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదని గ్రంథాలలో ఉంది.అలాగే హిందూ మతంలో తల్లి అన్నపూర్ణాదేవి( Annapurna Devi ) వంటగదిలో నివసిస్తుందని నమ్ముతారు.కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటనే పాచి పాత్రలు అలాగే ఉంచకూడదని చెబుతుంటారు.
ఆడ వారు ఇలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని,అలాగే ప్రతికూలత పెరుగుతుందని నమ్ముతారు.అలాంటి ఇంట్లో మనం ఎప్పటికీ సుఖ సంతోషాలు పొందలేమని శాస్త్రం చెబుతోంది.
కాబట్టి ఈ తప్పులను మహిళలు అస్సలు చేయకూడదు.