స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ ఒక్క రోజు దర్శనాలు రద్దు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ తిరుమల ( Tirumala )పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు.ఆ దర్శన భాగ్యం కలిగితే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటూ ఉంటారు.

 Important Note For Devotees Going To Visit Swami , Andhra Pradesh, Tirumala, Kal-TeluguStop.com

అలా ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక ఏమిటంటే ఈ నెల 12వ తేదీన శ్రీవారి దేవాలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.

Telugu Andhra Pradesh, Bhakti, Devotional, Kalyanotsavam, Oonjal, Tirumala-Lates

ముందు రోజైనా 11వ తేదీన బ్రేక్ దర్శనానికి సిఫారసులు లేఖలు స్వీకరించబడవు.అంతే కాకుండా ఆస్థానం కారణంగా కళ్యాణోత్సవం,ఆర్జిత మహోత్సవం,ఊంజల్ సేవలను( Kalyanotsavam, Arjita Mahatsavam, Oonjal services ) రద్దు చేయగా అర్చన తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.ఇంకా చెప్పాలంటే దీపావళి రోజు తిరుమల దేవస్థానంలో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీవారి దేవాలయం బంగారు వాకిలి ముందు దీపావళి ఆస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) నిర్వహిస్తుంది.

ముందుగా ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు వరకు అభిముఖంగా వేంచేపు చేస్తారు.

Telugu Andhra Pradesh, Bhakti, Devotional, Kalyanotsavam, Oonjal, Tirumala-Lates

ఆ తర్వాత సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరో పీఠంపై దక్షిణ విముఖంగా ఉంటారు.ఆ తర్వాత స్వామి వారికి ప్రత్యేక పూజ, హారతి ప్రసాద నివేదనలను నిర్వహించడంతో దీపావళి ఆస్థానం పూర్తి అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే సాయంత్రం మాత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయాప్ప స్వామి వారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని దేవాలయ నాలుగు మడ వీధులలో భక్తులకు దర్శనం ఇస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube