చర్మ ఛాయను పెంచే చియా సీడ్స్.. మరి ఇంతకీ వాటిని ఎలా వాడాలో తెలుసా?

చియా సీడ్స్( Chia Seeds ). వీటి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.

 How To Improve Skin Tone With Chia Seeds?, Skin Tone, Chia Seeds Benefits, Lates-TeluguStop.com

చాలా మంది వాటిని ఉదయం వాటర్ లో నానబెట్టుకుని తీసుకుంటూ ఉంటారు.ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించే వారు తప్పకుండా తమ డైట్ లో చియా సీడ్స్ ఉండేలా చూసుకుంటారు.

వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్ వరకు చియా సీడ్స్ తో బోలెడు ఆరోగ్య లాభాలు పొందవ‌చ్చు.అలాగే చర్మ సౌందర్యానికి కూడా చియా సీడ్స్ ఉపయోగపడతాయి.

ముఖ్యంగా చర్మ ఛాయ( Skin Whitening )ను పెంచే సత్తా వీటికి ఉంది.మరి ఇంతకీ స్కిన్ టోన్ ను పెంచుకోవడానికి చియా సీడ్స్ ను ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి అర కప్పు పచ్చి పాలు వేసుకొని గంట పాటు నానబెట్టుకోవాలి.ఈ లోపు ఒక చిన్న బీట్ రూట్ తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్ ను పాలతో సహా వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు( Beetroot ) కూడా వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకుని ఇర‌వై నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.ఆపై మాస్క్ ను తొలగించి వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ఎలాంటి క్రీములు, సీరంలు వాడకపోయినా మీ చర్మం సహజంగానే తెల్లగా కాంతివంతంగా మారుతుంది.అందంగా మెరుస్తుంది.కాబట్టి స్కిన్ టోన్( Skin Tone ) ను ఇంప్రూవ్ చేసుకునేందుకు ఆరాటపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజ‌ల్ట్ మీసొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube