వయసును దాచేసే వండర్ ఫుల్ ఆయిల్.. నిత్యం వాడారంటే యవ్వనంగా మెరిసిపోతారు!

వయసు పెరిగే కొద్దీ యవ్వనం( youth ) తగ్గడం అనేది సర్వసాధారణం.ముఖ్యంగా ముఖంపై ముడతలు ఏర్పడడం, చర్మం సాగటం, సన్నని గీతలు పడటం వంటివి ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడతాయి.

 This Wonderful Oil Helps To Get Youthful Skin! Wonderful Oil , Youthful Skin, Fa-TeluguStop.com

అయితే కొందరు మాత్రం వయసు పెరుగుతున్నా నవ యవ్వనంగా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు.అలాంటి వారిని చూసినప్పుడు అసూయ పడడం కామన్.

కానీ అటువంటి చర్మాన్ని మీరు కూడా పొందవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ ఆయిల్ ఉత్తమంగా సహాయపడుతుంది.

వయసును దాచేసి సామర్థ్యం ఈ ఆయిల్ కు ఉంది.నిత్యం ఈ ఆయిల్ ను వాడారంటే మీరు యవ్వనంగా మెరిసిపోవడం ఖాయం.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Face Oil, Skin, Skin Care, Skin Care Tips, Wonderfuloil, Wrinkles,

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు ఆలివ్ ఆయిల్( Olive oil ) ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజల పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి దాదాపు పది నిమిషాల పాటు ఉడికించాలి.

Telugu Tips, Face Oil, Skin, Skin Care, Skin Care Tips, Wonderfuloil, Wrinkles,

ఆపై క్లాత్ సహాయంతో ఆయిల్ ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.అనంత‌రం తయారు చేసుకున్న ఆయిల్ ను ముఖానికి అప్లై చేసుకుని కనీసం ఐదు నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.నిత్యం ఈ ఆయిల్ ను వాడితే సాగిన చర్మం టైట్ గా మారుతుంది.ముడతలు క్రమంగా మాయం అవుతాయి.సన్నని గీతలు తొలగిపోతాయి.

చర్మం మళ్లీ యవ్వనంగా కాంతివంతంగా మారుతుంది.అలాగే చాలామంది డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతుంటారు.

అలాంటి వారు ఈ ఆయిల్ ను రెగ్యులర్ గా వాడితే చర్మం తేమగా మృదువుగా ఉంటుంది.అందంగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube