పది నిమిషాల కంటే ఎక్కువ సమయం టాయిలెట్ లో మొబైల్ తో గడుపుతున్నారా.. అయితే ఈ భయంకరమైన వ్యాధి..?

ప్రతి రోజు తెల్లవారుజామున నిద్రలేచి కొంతమంది టాయిలెట్( toilet ) కి వెళ్తుంటారు.ప్రస్తుత సమాజంలో చాలామందికి మొబైల్ తో బాత్రూం కి వెళ్లే అలవాటు ఉంది.గ్లోబల్ సర్వేలో 73 శాతం మంది తమ మొబైల్ ను టాయిలెట్లో ఉపయోగిస్తున్నట్లు అంగీకరించారు.18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.టాయిలెట్లో పదినిమిషాల కంటే ఎక్కువ సమయం గడపడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 Are You Spending More Than Ten Minutes With Your Mobile In The Toilet But This T-TeluguStop.com

ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చోవడం వల్ల మలద్వారంలోని సిరల పై ఒత్తిడి పడుతుంది.ఫలితంగా అవి వాపు, చికాకు మరియు నొప్పిని కలిగిస్తాయి.దీని నుంచి ఇది హెమోరాయిడ్స్ అవుతుంది.

దీనిని పైల్స్ అని అంటారు.అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ( Urinary tract infection )కూడా వచ్చే అవకాశం ఉంది.

టాయిలెట్ మీద ఎక్కువ సేపు కూర్చుంటే మూత్రం నాళంలో బ్యాక్టీరియా పేరుకుపోయి అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది.కాబట్టి టాయిలెట్లో పదినిమిషాల కంటే ఎక్కువసేపు ఉండడం అస్సలు మంచిది కాదు.

అలాగే ఇన్ఫెక్షన్ రాకుండా ఎప్పుడు మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవాలి.నిపుణుల అభిప్రాయం ప్రకారం మూత్రం నిలుపుకోవడం మరియు తగినంత నీరు త్రాగకపోవడం వల్ల కూడా ఈ సమస్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.కాబట్టి రోజంతా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి.తగినంత నీరు త్రాగడం వల్ల శరీరం నుంచి బ్యాక్టీరియాను( Bacteria ) బయటకు పంపుతుంది.ఇంకా చెప్పాలంటే టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ నీరు వినియోగిస్తారు.అలాగే రోజువారి దిన చర్యకు అంతరాయం కలిగిస్తుంది.

చాలామంది ఉదయం నిద్ర లేచి టాయిలెట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటారు.ఇలా చేసేవాడికి పనికి వెళ్లడం, ఆఫీస్ కు వెళ్లడం, పాఠశాలకు వెళ్లడం వంటి రోజు వారి పనులకు ఆటంకం కలిగిస్తుంది.

ఇంకా చెప్పాలంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.

You Shouldn't Carry Your Phone to the Toilet

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube