చిన్న వయసులోనే వైట్ హెయిర్ సమస్యతో బాధ పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగి పోతోంది.మారుతున్న జీవశైలి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, హెయిర్ కేర్ లేకపోవడం, పోషకాల లోపం ఇలా రకరకాల కారణాల వల్ల హెయిర్ వైట్‌గా మారిపోతుంటుంది.
దాంతో ఈ సమస్య ఎలా నివారించుకోవాలో అర్థంగాకవైట్ హెయిర్‌ను కవర్ చేసుకునేందుకు కలర్ చేసుకుంటున్నారు.అయితే తెల్ల జుట్టును నివారించడంలో మెంతి ఆకు అద్భుతంగా సహాయపడుతుంది.
మరి జుట్టుకు మెంతాకును ఎలా యూజ్ చేయాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మెంతి ఆకు మరియు కరివేపాకు సమానంగా తీసుకున మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్‌లో నిమ్మ రసం కలిపి తలకు మరియు జుట్టు మొత్తానికి పట్టించాలి.ముప్పై, నలబై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే.తెల్ల జుట్టు క్రమంగా నల్ల బడుతుంది.

అలాగే ఒక కప్పు మెంతి ఆకులను తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు మెంతి ఆకుల పేస్ట్‌లో రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు, జుట్టు కుదుళ్లకు పట్టించి అర గంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూ యూజ్ చేసి తల స్నానం చేయాలి.
ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసి అందులో ఒక కప్పు మెంతి ఆకులను వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.
ఉదయాన్నే మెంతి ఆకులను పేస్ట్ చేసుకుని.అందులో పెరుగు మరియు బాదం ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ముప్పై నిమిషాల అనంతరం హెడ్ బాత్ చేయాలి.నాలుగు రోజులకు ఒకసారి ఇలా చేసినా జుట్టు నల్లబడుతుంది.