వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం.ఈ సీజన్ లోనే అంటువ్యాధుల( infections ) వ్యాప్తి చాలా అధికంగా ఉంటుంది.
అలాగే డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు విజృంభించేది కూడా వర్షాకాలంలోనే.అందుకే ఈ సీజన్లో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ముఖ్యంగా ఇమ్యూనిటీ సిస్టమ్ ( immune system )ని స్ట్రాంగ్ గా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ స్మూతీ వర్షాకాలంలో అదిరిపోయే ఇమ్యూనిటీ బూస్టర్ గా చెప్పుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక క్యారెట్( Carrot ) ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక ఆరెంజ్ పండును తీసుకుని తొక్క తొలగించి పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే ఆరెంజ్ పల్ప్ తో పాటు హాఫ్ బనానా( Banana ), ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న స్మూతీలో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia seeds ) ను మిక్స్ చేసి తీసుకోవడమే.ప్రస్తుత వర్షాకాలంలో ఈ స్మూతీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థను బలపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.రోజు మార్నింగ్ ఈ క్యారెట్ ఆరెంజ్ బనానా స్మూతీని తీసుకుంటే అనేక సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

ఒకవేళ జబ్బుల బారిన పడినా.చాలా త్వరగా రికవరీ అయిపోతారు.అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.అతి ఆకలి దూరం అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.రక్తహీనత దూరం అవుతుంది.
అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.
జుట్టు రాలడం తగ్గుతుంది.మరియు చర్మం కూడా యవ్వనంగా మెరుస్తుంది.
కాబట్టి వర్షాకాలంలో ఈ ఇమ్యూనిటీ బూస్టర్ స్మూతీ ని అస్సలు మిస్ అవ్వకండి.