వెన్న‌తో ఇలా చేస్తే మీ పిల్ల‌ల జుట్టు ఒత్తుగా పెరగ‌డం ఖాయం!

వెన్న‌.పాల ఉత్ప‌త్తుల్లో ఇది ఒక‌టి.వెన్న అద్భుత‌మైన రుచిని మాత్ర‌మే కాదు.విటమిన్ ఎ, విటమిన్‌ డి, విటమిన్‌ ఇ, విటమిన్ కె, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా–3, ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోష‌కాలెన్నిటినో క‌లిగి ఉంటుంది.

 Doing This With Butter Will Help Your Kids Hair Grow Thicker! Kids Hair, Butter,-TeluguStop.com

అందుకే వెన్న‌తో వెయ్యి లాభాలు అని పెద్ద‌లు అంటుంటారు.పరిమితంగా తీసుకుంటే వెన్న ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.అలాగే జుట్టు సంర‌క్ష‌ణ‌కు సైతం వెన్న ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా వెన్న‌తో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా చేస్తే మీ పిల్ల‌ల జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెర‌గ‌డం ఖాయం.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వెన్న‌తో ఏం చేయాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వెన్న‌ను వేసుకోవాలి.ఆ త‌ర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ప‌చ్చి పాలు, రెండు టేబుల్ స్పూన్ల ఆముదం, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

Telugu Butter, Care, Care Tips, Latest, Long, Thick-Telugu Health Tips

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మీ పిల్ల‌ల జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.రెండు గంట‌ల అనంత‌రం మంచి షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో హెయిర్ వాష్ చేయాలి.ఇలా వారానికి ఒక‌సారి గ‌నుక చేస్తే వెన్న‌లో ఉండే ప‌లు పోష‌కాలు జుట్టుకు బ‌లాన్ని చేకూర్చి ఒత్తుగా, పొడ‌వుగా ఎదిగేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

Telugu Butter, Care, Care Tips, Latest, Long, Thick-Telugu Health Tips

ఈ హెయిర్ మాస్క్‌ను పెద్ద‌లు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.పెద్ద‌లు వారానికి రెండు సార్లు పైన చెప్పిన హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు ఊడ‌టం త‌గ్గి.ఒత్తుగా పెర‌గ‌డం ప్రారంభం అవుతుంది.అలాగే వెన్న‌ జుట్టుకు మంచి తేమ‌ను అందిస్తుంది.అందువ‌ల్ల‌, పొడి జుట్టుతో బాధ‌ప‌డేవారు ఈ మాస్క్ ను వేసుకుంటే జుట్టు స్మూత్‌గా, సిల్కీగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube