టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన మంచు విష్ణు( Manchu Vishnu ) నటించిన కన్నప్ప మూవీ( Kannappa ) ఏప్రిల్ లో థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సమయానికి ఈ సినిమా విడుదల కాదని మంచు విష్ణు తాజాగా వెల్లడించారు.విజువల్ ఎఫెక్ట్స్( Visual Effects ) పనుల వల్ల ఈ సినిమా ఆలస్యం కానుందని మంచు విష్ణు పేర్కొన్నారు.
కన్నప్ప జీవిత ప్రయాణం అద్భుతమైనదని అత్యున్నత ప్రమాణాలు కలిగిన సినిమాటిక్ అనుభూతితో ఈ సినిమాను అందించడానికి కృత నిశ్చయంతో ఉన్నామని మంచు విష్ణు తెలిపారు.
అందుకోసం మాకు మరికొన్ని వారాల సమయం అవసరం అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలోని కీలక ఎపిసోడ్లకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కాలేదని ఆయన తెలిపారు.అందువల్ల సినిమా ఆలస్యం కానుందని మంచు విష్ణు అన్నారు.ఈ సినిమా కొరకు మీరెంత నిరీక్షిస్తున్నారో అర్థమవుతుందని ఆయన వెల్లడించారు.

ఈ సినిమా ఆలస్యం అవుతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని మంచు విష్ణు కామెంట్లు చేశారు.మీ సహనానికి, సహకారానికి ధన్యవాదాలు అని ఆయన తెలిపారు.మహా శివుడికి కన్నప్ప ఎంత గొప్ప భక్తుడో అందరికీ తెలుసని అలాంటి భక్తుడి కథను మీ ముందుకు అద్భుతంగా తీసుకొనిరావాలని అనుకుంటున్నామని మంచు విష్ణు కామెంట్లు చేశారు.

మా బృందం పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని ఆయన తెలిపారు.త్వరలో కొత్త విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు వస్తామని మంచు విష్ణు వెల్లడించారు.కన్నప్ప సినిమా ఎప్పుడు విడుదలైనా సంచలన విజయం సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.కన్నప్ప సినిమాలో ప్రభాస్( Prabhas ) రుద్ర పాత్రలో కనిపించనున్నారు.ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటించడం గమనార్హం.