సాధారణంగా భూమి అంతర్భాగంలో సంభవించే అకస్మాత్తుగా భూకంపాల( Earthquakes ) కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడం సర్వసాధారణం.భూకంపం సమయంలో భూమి కంపించడంతో భవనాలు, వంతెనలు, రహదారులు నాశనమవుతాయి.
రిక్టర్ స్కేలుపై( Richter Scale ) భూకంప తీవ్రతను కొలుస్తారు.భారీ భూకంపాల కారణంగా సునామీలు, భూ చీలికలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.
మయన్మార్‌లో( Myanmar ) శుక్రవారం మధ్యాహ్నం 12:50 గంటలకు భారీ భూకంపం సంభవించింది.మొదట 7.7 తీవ్రతతో భూమి కంపించగా, కొన్ని నిమిషాల తర్వాత మరోసారి 6.4 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.భూకంప ధాటికి పెద్ద భవనాలు ఊగిపోయి కుప్పకూలాయి.ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.మరోసారి భూకంపం వస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలను భవనాల నుంచి ఖాళీ చేయిస్తున్నారు.ఈ భూకంప ప్రభావం థాయ్‌లాండ్‌పై కూడా తీవ్రంగా కనిపించింది.రాజధాని బ్యాంకాక్‌లో( Bangkok ) 7.3 తీవ్రతతో భూమి కంపించడంతో భవనాలు ఊగిపోయాయి.భయంతో జనాలు రోడ్ల మీదకు పరుగులు తీశారు.సామాజిక మాధ్యమాల్లో భవనాల కూలిపోతున్న దృశ్యాలు, ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ భూకంపం ప్రభావం మయన్మార్, థాయ్‌లాండ్‌తో పాటు చైనా, భారత్, లావోస్, బంగ్లాదేశ్‌లోనూ కనిపించింది.భారతదేశంలోని మణిపూర్, కోల్‌కతా, మేఘాలయా, అస్సాం, నాగాలాండ్ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించిందని నివేదికలు చెబుతున్నాయి.భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.మయన్మార్‌లోని సగైంగ్ ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో, భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
ప్రకంపనల ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం కుప్పకూలింది.మండాలెలో ఇర్రవడ్డీ నదిపై ఉన్న చారిత్రక అవా బ్రిడ్జి కూడా ధ్వంసమైంది.ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.మయన్మార్, థాయ్‌లాండ్ ప్రభుత్వాలు అత్యవసర సేవలను సమీకరించి, బాధితులకు సహాయం అందిస్తున్నాయి.బాధితులకు తక్షణ సాయం అందించేందుకు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి.
భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తులను ముందుగా గుర్తించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.