పొట్ట‌ను త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? అయితే ఈ డ్రింక్ మీకోస‌మే!

ఇటీవ‌ల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది బాన పొట్ట‌తో ముప్ప తిప్ప‌లు ప‌డుతున్నారు.ఎక్కువ స‌మ‌యం పాటు ఒకే చోట కూర్చోవ‌డం, ఫాస్ట్ ఫుడ్స్‌ను అధికంగా తీసుకోవ‌డం, శ‌రీరానికి శ్ర‌మ లేక పోవ‌డం, ఒత్తిడి, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పొట్ట చుట్టు కొవ్వు పేరుకు పోతుంటుంది.

 Best Drink To Get Rid Of Belly Fat ,  Best Drink , Belly Fat , Latest News , Hea-TeluguStop.com

దాంతో పెరిగిన పొట్ట‌ను మ‌ళ్లీ క‌రిగించుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే పొట్ట‌ను త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారికి ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్ సూప‌ర్‌గా హెల్ప్ చేస్తుంది.

మ‌రి ఆ డ్రింక్ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? మ‌రియు ఏ టైమ్‌లో ఆ డ్రింక్‌ను తీసుకోవాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు నిమ్మ కాయ‌ల‌ను తీసుకుని వాట‌ర్‌లో శుభ్రంగా క‌డ‌గి.తొక్క‌తో పాటుగానే చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాట‌ర్ పోయాలి.వాట‌ర్ కాస్త హీట్ అవ్వ‌గానే అందులో క‌ట్ చేసి పెట్టుకున్న నిమ్మ కాయ ముక్క‌లు, మూడు దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు, రెండు ల‌వంగాలు వేసి పావు గంట పాటు బాగా మ‌రిగించాలి.

చివ‌ర్లో గుప్పెడు కొత్తిమీర వేసి మ‌రో మూడు నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని వ‌న్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి సేవించాలి.ఉద‌యాన్నే ఈ డ్రింక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట చుట్టు పేరుకు పోయిన కొవ్వంతా క్ర‌మంగా క‌రిగిపోతుంది.దాంతో మీ పొట్ట సూప‌ర్‌గా త‌గ్గుతుంది.అలాగే ఈ డ్రింక్‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు సైతం బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.సో.త‌ప్ప‌కుండా ఈ డ్రింక్‌ను తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

Best Drink To Get Rid Of Belly Fat , Best Drink , Belly Fat , Latest News , Health , Health Tips , Good Health , Weight Loss , Weight Loss Tips - Telugu Belly Fat, Tips, Latest

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube