అమెరికా,( America ) చైనా( China ) మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం.( Trade War ) ఇప్పుడు లగ్జరీ ఫ్యాషన్ ప్రపంచంలోకి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.
గ్లిట్జ్ అనే సంస్థ రిపోర్ట్ ప్రకారం, అమెరికా విధించిన టారిఫ్‌లకు చైనా ఊహించని విధంగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.ఎలాగంటే, లగ్జరీ బ్రాండ్ల నకిలీ వస్తువులపై ఆంక్షలు సడలించే ఆలోచనలో ఉందట.
అంటే ఇక మార్కెట్లో అమెరికన్, యూరోపియన్ బ్రాండ్ల నకిలీలు వరదలా వచ్చేస్తాయన్నమాట.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చైనా దిగుమతులపై ఏకంగా 145% టారిఫ్ వేశారు.దీంతో చైనా కూడా ఊరుకుంటుందా, వెంటనే 125% టారిఫ్‌లతో అమెరికాకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.“తప్పుల్ని సరిదిద్దుకోండి, ‘పరస్పర టారిఫ్‌లు’ వాడటం ఆపండి” అంటూ చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.“అమెరికా గౌరవంగా మాతో కలిసిపోయే దారిలోకి వస్తుందని ఆశిస్తున్నాం” అని కూడా కుండబద్దలు కొట్టారు.
ఇదిలా ఉంటే, ట్రంప్( Trump ) ఏప్రిల్ 2న “విమోచన దినోత్సవం” స్పీచ్‌లో 90 రోజుల పాటు కొత్త టారిఫ్‌లు ఉండవని ప్రకటించారు.కొన్ని చైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు కాస్త వెసులుబాటు ఇచ్చారు.కానీ సెమీకండక్టర్లపై మాత్రం కొత్త టారిఫ్( Tariff ) వేసేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారట.
అయితే ఇప్పుడు అందరి దృష్టి పొలిటికల్ వార్ పై లేదు.టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న వీడియోలే హాట్ టాపిక్.చైనా ఫ్యాక్టరీ కార్మికులు బయటపెడుతున్న నిజాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.“మేము టాప్ లగ్జరీ బ్రాండ్ల( Luxury Brands ) కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నాం, కానీ మాకు మాత్రం సరైన గుర్తింపు, డబ్బులు లేవు” అని వాళ్లు వాపోతున్నారు.
ఒక వీడియోలో అయితే ఒక వ్యక్తి డిజైనర్ బ్యాగులతో నిండిపోయిన ఒక పెద్ద గిడ్డంగిలో నిలబడి అసలు నిజం చెప్పేశాడు.“మేం 30 ఏళ్లుగా చాలా లగ్జరీ బ్రాండ్లకు అసలైన ఫ్యాక్టరీలం” అని బాంబ్ పేల్చాడు.“మేం తక్కువ జీతాలకు పనిచేసే కూలీలం మాత్రమే కానీ బ్రాండ్లు మాత్రం వీటిని భారీ లాభాలకు అమ్ముకుంటున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
చైనా ఫ్యాక్టరీల దగ్గర బెస్ట్ స్కిల్స్, క్వాలిటీ, సప్లై చైన్స్ అన్నీ ఉన్నాయని అతడు గట్టిగా చెప్పాడు.
లగ్జరీ బ్రాండ్లు ప్రొడక్షన్ వేరే దేశాలకు మార్చాలని చూసినా.చైనా క్వాలిటీని అందుకోలేకపోయారని కూడా తేల్చి చెప్పాడు.చివరిగా అసలు విషయం చెప్పేశాడు.“1000 డాలర్లు ఖరీదు చేసే వస్తువు కోసం 38,000 డాలర్లు ఎందుకు కట్టాలి? డైరెక్ట్‌గా మా దగ్గర కొనండి” అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు.
ఇంతకాలం దాచిన లగ్జరీ ధరల మతలబుని ఈ వీడియోలు బయటపెడుతున్నాయి.అసలు ఎవరు నిజంగా లబ్ధి పొందుతున్నారో ఇప్పుడు అందరికీ క్లియర్ గా అర్థమవుతోంది.