గసగసాలు.వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన ఈ గసగసాలను నాన్ వెజ్ వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.కొందరు గసగసాలతో పాయసం చేస్తారు, స్వీట్ల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు.
గసగసాలతో ఎలా చేసినా.రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది అనడంలో సందేహం.
అయితే రుచిలోనే కాదు.గసగసాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
ఎన్నో జబ్బులను నయం కూడా చేస్తాయి.
ముఖ్యంగా నిద్రించే ముందు గసగసాలను పేస్ట్ చేసి.
వేడి పాలలో కలిపి సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.నిద్రలేమితో బాధ పడేవారు ఈ డ్రింక్ తాగితే.
చక్కటి మరియు ప్రశాంతమైన నిద్ర పడుతుంది.అలాగే శ్వాస సమస్యలు ఉన్న రాత్రి వేళ మరింత ఇబ్బందిని ఎదుర్కొంటుంటారు.
అయితే వేడి పాలలో గసగసాల పేస్ట్ కలిపి తాగితే.అందులో ఉండే పలు గుణాలు శ్వాస సమస్యలు అంటే ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆస్తమా వంటి వాటిని క్రమంగా తగ్గిస్తుంది.

ఇక గసగసాలతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.గసగసాల్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది.అందువల్ల, ఎవరైతే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారో.అలాంటి వారు గసగసాలను రెగ్యులర్గా తగిన మోతాదులో ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.గసగసాలు తీసుకోవడం గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఉండవు.
అలాగే ఎదిగే పిల్లలకు గసగసాలను బెల్లం మరియు నెయ్యి కలిపి ఇవ్వడం వల్ల.
వారిలో ఆలోచించే శక్తి పెరగడంతో పాటుగా ఎప్పుడు యాక్టివ్గా, బలంగా ఉంటారు.గసగసాలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని గసగసాలను అతిగా మాత్రం తీసుకోరాదు.ఇక లైంగిక సమస్యలు ఎదుర్కొనే వారి వీటికి దూరంగా ఉండటమే మంచిది.