సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైనటువంటి వారిలో నటీ రకుల్ ప్రీతిసింగ్( Rakul Preet Singh ) ఒకరు.ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలలో నటించిన ఈమె ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇకపోతే గత ఏడాది రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానినీ( Jacky Bhagnani ) ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
వీరి వివాహం గోవాలో ఎంతో ఘనంగా జరిగింది.

ఇలా పెళ్లి తర్వాత కూడా రకుల్ పలు ప్రాజెక్టులలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు.అయితే తాజాగా ఈ దంపతులకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.రకుల్ త్వరలోనే తల్లి కాబోతున్నారని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు.ఇటీవల రకుల్ కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు.
అదేవిధంగా రకుల్.టైట్ ఫిట్ అండ్ గ్లామర్ డ్రస్సుల్లో ఎప్పటికప్పుడు కనిపిస్తుంటుంది.
కానీ ఇప్పుడు ఫుల్ కంఫర్ట్ అండ్ ఫ్రీ డ్రెస్సుల్లో సందడి చేస్తుంది.

ఇలా రకుల్ ఉన్నఫలంగా తన డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మార్చేయడంతో దాని వెనుక కారణం ప్రెగ్నెన్సీ( Pregnancy ) అని తెలుస్తుంది.గర్భిణీ అవ్వడం వల్ల డ్రెస్సింగ్ సెన్స్ లో ఛేంజ్ తీసుకొచ్చిందని నెటిజన్లు అంటున్నారు.దీనికి తోడు జాకీ పోస్ట్ చేసిన వీడియో బలం చేకూరింది ఈయన కిచెన్లోకి వెళ్లి తన భార్య కోసం ఎంతో ప్రేమతో వంట చేస్తున్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు దీంతో రకుల్ తల్లి కాబోతుందని అయితే ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించలేదని అభిమానులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఈ జంట స్పందించాల్సి ఉంది.