ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోగా మంచి సక్సెస్ అందుకున్న జగపతిబాబు( Jagapathi Babu ) సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈయన హీరోగా కంటే కూడా విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు.అయితే తాజాగా ఈయన ఓ బుల్లితెర కార్యక్రమానికి హాజరయ్యారు.

జీ తెలుగులో వస్తున్న డ్రామా జూనియర్స్( Drama Juniors ) షోకి గెస్ట్ గా వచ్చారు.ఆమని( Amani ) కూడా గెస్ట్ గా వచ్చారు.ఈ షోకి అనిల్ రావిపూడితో పాటు హీరోయిన్ రోజా( Roja ) జడ్జిగా వ్యవహరిస్తున్నారు.అయితే రోజా ఆమని జగపతిబాబు( Jagapathi Babu ) కలిసి నటించిన శుభలగ్నం ( Subhalagnam ) సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా జగపతిబాబు శుభలగ్నం సినిమా విడుదలైన తర్వాత తనుకు ఎదురైన ఒక సంఘటన గురించి అందరితో పంచుకున్నారు.

శుభలగ్నం సినిమా రిలీజయిన కొద్ది రోజులకే ఓ ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను.ఇలా ఎన్నికల ప్రచారానికి వెళ్లడంతో పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చారు.అందులో నుంచి ఒకరు నన్ను చూసి ఒరే.వీడినేరో పెళ్ళాం అమ్మేసింది కోటి రూపాయలకు వీడినే.అని అరిచారు.
ఆ మాటలు వినగానే నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను కానీ ఈ సినిమా అప్పట్లో జనాలను ఎంతగా ఆకట్టుకుందో ఆ ఒక్క సంఘటనతోనే అర్థమైంది అంటూ అప్పటి విషయాలను జగపతిబాబు గుర్తు చేసుకున్నారు.ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా అప్పట్లో సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుంది.