సినీ నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం రాజకీయాలలో( Politics ) బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.జనసేన పార్టీ ( Janasena Party ) అధినేతగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఈయన రాజకీయ కార్యకలాపాలలో ఎంతో బిజీగా ఉన్నారు.
నిత్యం సభలు సమావేశాలు అధికారులతో సమీక్ష అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.ఇవి కాకుండా మరోవైపు జిల్లాల పర్యటన అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఇలా బిజీగా ఉంటున్న నేపథ్యంలో ఆయన కమిట్ అయిన సినిమాలు కాస్త మరింత ఆలస్యం అవుతున్నాయి.

పవన్ గతంలో కమిట్ అయిన మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్నాయి.అయితే ఇందులో హరిహర వీరుమల్లు( Harihara Veeramallu ) సినిమా మాత్రం షూటింగ్ పూర్తి అయ్యింది.దీంతో ఈ సినిమాని మే తొమ్మిదో తేదీ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అదేవిధంగా హీరోయిన్ నిధి అగర్వాల్ తో కలిసి ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను రామ్ చరణ్ ( Ramcharan ) తో పాటు తన అన్నయ్య చిరంజీవి( Chiranjeevi ) తీసుకోబోతున్నారని తెలుస్తోంది.త్వరలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది.ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారని అలాగే ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.ఇలా పవన్ బిజీగా ఉన్న నేపథ్యంలోనే తన సినిమా బాధ్యతలను చిరంజీవి తీసుకున్నట్టు సమాచారం.
ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తి నెలకొంది.