టాలీవుడ్ ఇండస్ట్రీలోని( Tollywood industry ) ప్రముఖ కొరియోగ్రాఫర్లలో శివశంకర్ మాస్టర్ ( Shiva Shankar is a master )ఒకరు.ఎన్నో హిట్ సాంగ్స్ కు ఆయన కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.పలు సినిమాలలో కీలక పాత్రల్లో నటించి ఆయన మెప్పించారు.2021 సంవత్సరంలో శివశంకర్ మాస్టర్ కన్నుమూశారనే సంగతి తెలిసిందే.శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ ( Vijay Sivashankar )ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
మా తాతవాళ్లది రాజమండ్రి అని మాకు 70 నుంచి 80 ఎకరాలు ఉండేవని ఆ తర్వాత చెన్నై షిఫ్ట్ అయ్యారని ఆయన తెలిపారు.నాన్నకు చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో వెన్నెముక విరిగిందని ఆ సమయంలో నరకం అనుభవించారని 12 సంవత్సరాల తర్వాత నాన్న కోలుకున్నాడని శివశంకర్ మాస్టర్ పేర్కొన్నారు.12 సంవత్సరాల తర్వాత నాన్న కోలుకున్నాడని శివశంకర్ మాస్టర్ కొడుకు కామెంట్లు చేశారు.

నాన్నకు కరోనా వచ్చిన సమయంలో రోజుకు 7 లక్షల రూపాయలు( 7 lakh rupees ) ఖర్చైందని కరోనా తగ్గిన తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి నాన్న మరణించాడని ఆయన పేర్కొన్నారు.కరోనా వల్ల ఇండస్ట్రీ నుంచి ఓంకార్, అశ్విన్ ఎవరూ నాన్న పాడె మోసేందుకు రాలేదని తెలిపారు.మా నాన్నకు లైఫ్ లో ఉన్న చేదు అనుభవం అంటే అది నా భార్య చేసిన నిర్వాకం వల్లే అని వెల్లడించారు.

పాప పుట్టిన తర్వాత తను మారిపోయిందని ఆయన తెలిపారు.నిజానికి తను మంచి అమ్మాయే అని మా నాన్నకు చాలా ఆస్తి ఉండటంతో ఒక్క కంప్లైంట్ చేస్తే ఆస్తి కొట్టేయొచ్చని తను భావించిందని ఆయన పేర్కొన్నారు.చెప్పుడు మాటలు విని 10 కోట్ల రూపాయలు, నాన్న కట్టిన ఇల్లు కావాలని ఆమె ధర్నా చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.
విజయ్ శివశంకర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.