అడవి జంతువులు మనిషికి ఎంతో ప్రమాదకరమైనవో తెలిసిన విషయమే.వాటితో జాగ్రత్తగా వ్యవహరించకాపోతే, అణచలేని ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది.
అయినప్పటికీ కొన్ని మంది వ్యక్తులు ఈ క్రూర జంతువులతో సరదాగా ఆటలు ఆడి, వీడియోలు తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.వాటిని చూసి కొందరు ఆశ్చర్యపోతే, మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలా ఇప్పుడు మరోసారి పాకిస్తానీ కంటెంట్ క్రియేటర్ నౌమాన్ హసన్( Nauman Hasan ) తెగ దుమ్ము రేపుతున్నాడు.
ప్రమాదకరమైన అడవి జంతువులను పెంపుడు జంతువుల్లా చూసే నౌమాన్ హసన్.తాజాగా ఓ భారీ పులిని( Tiger ) ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అతనే తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేయగా.
అది క్షణాల్లో వైరల్( Viral ) అయింది.పులికి ముద్దు పెట్టేందుకు అతను దగ్గరగా వెళ్లడం చూసిన వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
పులి కదలకుండా ఉండటం, హసన్ ముద్దు పెట్టే ప్రయత్నం చేయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది పైగా వీక్షించారు.అయితే చాలా మంది అతని ధైర్యాన్ని మెచ్చుకోగా, మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శించారు.వీటిని చూసి మీరు కూడా ఇలాంటి సరదా, భయంకరమైన వీడియోలు తీయాలని ప్రయత్నించొద్దు అని హెచ్చరిస్తున్నారు.
మరికొందరేమో వీడికి త్వరలో మూడిందని కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే, ఇది నౌమాన్ హసన్‌కు మొదటి వివాదాస్పద వీడియో కాదు.
ఇంతకుముందు కూడా అతను ఒక రద్దీ వీధిలో గొలుసుతో కట్టిన పులిని పట్టుకుని నడుస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అప్పట్లో అది తీవ్ర విమర్శలకు దారితీసింది.