ఆ తమిళ స్టార్ హీరో వైపు త్రివిక్రమ్ చూపు.. ఆ స్టార్ హీరో అవకాశం ఇస్తారా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో ( Kollywood industry )మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో శివ కార్తికేయన్ ( Siva Karthikeyan )ఒకరు.తమిళంలో సినిమా సినిమాకు పాపులర్ అవుతున్న ఈ నటుడు మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

 Director Trivikram Focus On Shivakarthikeyan Details Inside Goes Viral In Social-TeluguStop.com

బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో శివ కార్తికేయన్ త్రివిక్రమ్( Trivikram ) కాంబోలో సినిమా రానుందని వార్తలు జోరుగా వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ఇప్పటికే వెంకీ త్రివిక్రమ్ గురించి వార్తలు వినిపించగా అదే సమయంలో త్రివిక్రమ్ శివ కార్తికేయన్ కాంబో గురించి కూడా వార్తలు వినిపించడం కొసమెరుపు.

అయితే త్రివిక్రమ్ పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదగాలంటే ఇతర భాషల డైరెక్టర్లకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.త్రివిక్రమ్ తో సినిమా అంటే ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చవుతుందనే సంగతి తెలిసిందే.

Telugu Trivikram, Kollywood-Movie

తన రేంజ్ హీరోలకు మాత్రమే త్రివిక్రమ్ సైతం ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు.త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి శివ కార్తికేయన్ కూడా ఆసక్తిగానే ఉన్నారని తెలుస్తోంది.శివ కార్తికేయన్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.శివ కార్తికేయన్ త్రివిక్రమ్ కాంబో సినిమా గురించి త్వరలో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాల్సి ఉంది.

Telugu Trivikram, Kollywood-Movie

టాలీవుడ్ డైరెక్టర్లు( Tollywood directors ) తమిళ హీరోలపై తమిళ డైరెక్టర్లు టాలీవుడ్ హీరోలపై దృష్టి పెడుతుండటం గమనార్హం.స్టార్ హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సొంతమయ్యే అవకాశం అయితే ఉంది.శివ కార్తికేయన్ కు కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడం ద్వారా టాలీవుడ్ మార్కెట్ అంచనాలను మించి పెరిగే ఛాన్స్ అయితే ఉంది.త్రివిక్రమ్ భవిష్యత్తు సినిమాలు సైతం హారిక హాసిని బ్యానర్ లోనే తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.

ఒక విధంగా ఈ బ్యానర్ త్రివిక్రమ్ సొంత బ్యానర్ అనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube