చుండ్రు..( Dandruff ) చాలా మందికి చిరాకు పుట్టించే కామన్ సమస్య ఇది.పెద్దలే కాదు పిల్లలను కూడా చుండ్రు అనేది బాగా ఇబ్బంది పెడుతుంటుంది.చుండ్రు వల్ల తలలో దురద, చిరాకు, జుట్టు అధికంగా రాలిపోవడం, కుదుళ్ళు బలహీనపడటం, జుట్టు పొడిబారడం తదితర సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే చుండ్రు సమస్యను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా సూపర్ గా హెల్ప్ అవుతుంది.ఈ ఇంటి చిట్కాతో చాలా సులభంగా చుండ్రుకు చెక్ పెట్టవచ్చు.
అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకుని( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకోవాలి.
అలాగే మూడు రెబ్బలు కరివేపాకు,( Curry Leaves ) గుప్పెడు వేపాకు( Neem Leaves ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

40 నిమిషాలు లేదా గంట అనంతరం యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేశారంటే చాలా త్వరగా రిజల్ట్ ను గమనిస్తారు.అలోవెరా, వేపాకు, కరివేపాకు, ఆముదం.
ఇవన్నీ చుండ్రుకు వ్యతిరేకంగా పోరాడుతాయి.స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి.
రెండు మూడు వారాల్లోనే చుండ్రును సంపూర్ణంగా తొలగిస్తాయి.

అంతేకాకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించడం వల్ల జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.డ్రై హెయిర్ సమస్య దూరం అవుతుంది.హెయిర్ ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది.
కాబట్టి చుండ్రుతో వర్రీ అవుతున్నవారు తప్పకుండా ఇప్పుడు చెప్పకున్న ఇంటి చుట్కాను పాటించండి.