ముఖం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్న కూడా అక్కడక్కడ కనిపించే నల్లటి మచ్చలు( Dark Spots ) అందం మొత్తాన్ని పాడు చేస్తాయి.అందుకే చాలా మంది డార్క్ స్పాట్స్ కారణంగా చాలా వర్రీ అవుతూ ఉంటారు.
వాటిని వదిలించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలు ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ క్రీమ్ తో సులభంగా మరియు వేగంగా నల్ల మచ్చలకు గుడ్ బై చెప్పవచ్చు.

అందుకోసం ముందుగా రెండు నిమ్మ పండ్లను( Lemon ) తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి తొక్కను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో సపరేట్ చేసి పెట్టుకున్న నిమ్మ తొక్కలు మరియు మూడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ లెమన్ పీల్ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloevera Gel ) మరియు హాఫ్ టీ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet Almond Oil ) వేసుకుని రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేశారంటే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.

ఒక బాక్స్ లో ఈ క్రీమ్ ను నింపుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న లెమన్ పీల్ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను కనుక వాడటం అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీరు రిజల్ట్ చూసి షాక్ అవుతారు.ఈ క్రీమ్ ఎలాంటి ముదురు రంగు మచ్చలనైనా క్రమంగా తగ్గిస్తుంది.
స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేస్తుంది.అదే సమయంలో ఈ క్రీమ్ చర్మానికి కొత్త మెరుపును జోడిస్తుంది.
స్కిన్ ను స్మూత్ గా మారుస్తుంది.మొటిమలు, ముడతల సమస్యకు చెక్ పెడుతుంది.
చర్మం అందంగా యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.