నానబెట్టిన బాదం పప్పులో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే... రోజు తింటారు

ప్రతి రోజు బాదం పప్పులను తినటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే.అదే నానబెట్టిన బాదాం పప్పును తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

 Benefits Of Eating Soaked Almonds Details, Soaked Almonds, Almonds, Almonds Heal-TeluguStop.com

బాదం పప్పు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది.శరీరం పోషకాలను పూర్తిస్థాయిలో శోషించుకోకుండా ఇది అడ్డుపడుతుంది.

నానబెట్టిన బాదంలో విటమిన్ బి7, ఫోలిక్ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన వృద్ధాప్య ఛాయల నుండి కాపాడుతుంది.

ఇప్పుడు బాదం పప్పును ఎలా నానబెట్టాలో తెలుసుకుందాం.

గుప్పెడు బాదం పప్పులను ఒక చిన్న బౌల్ లో వేసి అవి మునిగేలా నీటిని పోయాలి.తర్వాత మూతపెట్టి సుమారు 8 గంటలు నాననివ్వాలి.

ఆ తర్వాత వాటి తోలు తీసి తినేయాలి.తోలు తీశాక ప్లాస్టిక్ బాక్సులో ఉంచి మూత పెడితే ఐదారు రోజుల వరకు నిల్వ ఉంటాయి.

ఇప్పుడు బాదం పప్పులో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

1.బాదం పప్పులోని రిబోప్లేవిన్, ఎల్ – అకామిటైన్ లు మెదడును చురుకుగా పని చేసేలా చేస్తుంది.దీని వల్ల వృద్ధాప్యం లో మతి మరుపు ( అల్జీమర్స్ ) రాదు.

2.బాదంలోని పీచు, యాంటీ యాక్సిండెంట్ లు గుండె సంబంధింత వ్యాధులను తగ్గిస్తుంది.

3.తిండి తినమని మారాం చేసే పిల్లలకు రోజు రెండూ మూడూ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినిపిస్తే,వాళ్ళకు కావలసిన పోషకాలు అందుతాయట.

Telugu Almonds, Immunity, Skin, Soaked Almonds, Soakedalmonds, Teeth, Vitamins-T

4.ఇది రోజు తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

5.వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతాయి.

6.దీనిలో వుండే కాల్షియం ఎముకలను దంతాలను గట్టి పరుస్తాయి.

7.నరాల వ్యవస్థను శక్తి మంతం చేస్తాయి.

8.ఈ నీటిని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న బాదం పప్పుని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube