సాధారణంగా కొందరికి శరీరంతో పోలిస్తే ముఖ చర్మం కాస్త నల్లగా ఉంటుంది.ఎండల ప్రభావం, దుమ్ము, ధూళి, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే మేకప్ ప్రొడెక్ట్స్‌ను వాడటం వంటి రకరకాల కారణాల వల్ల ముఖ చర్మం డార్క్‌గా మారుతుంటుంది.
దాంతో ముఖాన్ని మళ్లీ తెల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్‌లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్, సీరమ్స్ వాడుతుంటారు.రకరకాల ఫేస్ మాస్క్‌లను వేసుకుంటారు.
అయినా సరే ఎలాంటి ఫలితం కనిపించకుంటే ట్రీట్‌మెంట్స్ వరకు వెళ్తారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే రెమెడీని వారంలో మూడు సార్లు ట్రై చేస్తే గనుక సహజంగానే మీ ముఖం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక పల్చటి వస్త్రం తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసి.
దానిలో ఉండే వాటర్ మొత్తాన్ని తొలగించాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నైట్ అంతా నానబెట్టుకుని పొట్టు తొలగించిన బాదం పప్పులు ఎనిమిది, నీరు తొలగించి పెరుగు, ఐదు గులాబీ రేకలు, పావు స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
వారంలో మూడంటే మూడు సార్లు ఈ విదంగా ఫేస్ ప్యాక్ వేసుకుంటే.కేవలం కొద్ది రోజుల్లోనే మీ స్కిన్ టోన్ పెరగడాన్ని గమనిస్తారు.పైగా ఈ రెమెడీని ట్రై చేయడం వల్ల ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.ఒకవేళ ఉన్నా.
అవి క్రమంగా మాయమై ముఖం యవ్వనంగా, ప్రకాశవంతంగా మారుతుంది.