సినిమా హిట్ అవడానికి ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెబుతుంటారు.అయితే కొన్ని సినిమాలు మాత్రం కథానాయిక వల్ల హిట్ అయిన సందర్భాలు ఉంటాయి.
అలాంటి హీరోయిన్స్ కి పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంటుంది.ఆ హీరోయిన్స్ కూడా కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తూ వస్తారు.
ప్రస్తుతం తెలుగులో మంచి ఫాం లో ఉన్న ఒక హీరోయిన్ కు తమిళ సినిమా ఆఫర్ వచ్చిందట.అయితే ఆమెకు ఆ ఆఫర్ నచ్చినా సరే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సినిమా కాదన్నదట.
సదరు తమిళ హీరో హీరోయిన్ కి ఎప్పుడు కుదిరితే అప్పుడే షూటింగ్ కానీ ఖచ్చితంగా సినిమాలో ఆ హీరోయినే ఉండాలని పట్టుబడుతున్నాడట.ఇంతకీ ఆ హీరో ఎవరంటే కోలీవుడ్ స్టార్ విశాల్ అని తెలుస్తుంది.
ఆయన ఏ హీరోయిన్ కోసం ఇలా అంటున్నాడు అంటే ఆమె ఉప్పెన బేబమ్మ కృతి శెట్టి అని అంటున్నారు.విశాల్ హీరోగా తమిళ స్టార్ డైరక్టర్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.
ఆ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట.

ఆ సినిమా కథ నచ్చి చేయాలని ఉన్నా డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సినిమా వద్దనుకుందట కృతి.అయితే డేట్స్ వల్లే అయితే మీకు కుదిరినప్పుడే షూటింగ్ పెట్టుకుందామని డైరక్టర్, హీరో చెప్పారట.తమిళంలో ఆల్రెడీ సూర్య సినిమాతో పరిచయం అవుతున్న కృతి శెట్టి మరో రెండు ఆఫర్లు వచ్చాయట.
విశాల్ సినిమాలో ఆమె కోరినట్టుగా డేట్స్ అడ్జెస్ట్ అడిగే సరికి అమ్మడు ఈ సినిమాకు సైన్ చేసిందని టాక్.అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు దాదాపు 2.5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని కోలీవుడ్ మీడియా టాక్. తెలుగులో వచ్చిన క్రేజ్ ని తమిళంలో కూడా కొనసాగిస్తూ బేబమ్మ అక్కడ కూడా అదరగొట్టేస్తుంది.
సూర్యతో చేస్తున్న సినిమా హిట్ పడితే అక్కడ కూడా తన ఫాం కొనసాగించే ఛాన్స్ ఉంది.