ప్రతి మనిషి కి వైధవ్యం వస్తుంది.నిజానికి ప్రతి జీవికి వస్తుంది.
అయితే ఏ వయసులో ఉన్న కూడా వారిలో ఉండే అమోఘమైన ప్రతిభ ఎప్పుడు విరాజిల్లుతూనే ఉంటుంది.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అద్భుతమైన గాత్రం గురించి.
ఒకసారి సింగర్ అయ్యారంటే జీవితాంతం పాట మనల్ని వదిలిపెట్టి పోదు.వయసు తో పాటు కాస్త తేడా వచ్చిన గానం లో ఉండే మాధుర్యం మాత్రం అలాగే ఉంటుంది.
మన సినిమా ఇండస్ట్రీ లో ఆలా తమదైన శైలి లో లేటు వయసులో సైతం పాటలు పాడి తమలోని గాత్రానికి ముసలితనం రాలేదు అని అనిపించుకున్నారు కొందరు గాయనీమణులు.
అలాంటి వారిలో ముఖ్యం గా చెప్పుకోవాల్సిన వారు లతా మంగేష్కర్, ఎస్ జానకి, పి సుశీల, జామున రాణి తదితరులు ఉంటారు.
వీరు ఇప్పటికి పాటలు పాడుతూ తెరపైన వారి పాటలను చూసుకుంటూ శేష జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు.మరి ముఖ్యం గా 80 ఏళ్ళు వచ్చిన జానకమ్మ ఇంకా పాడుతూనే ఉన్నారు.
అయితే ఇలా అందరు పడలేరు.కొంత మంది సింగెర్స్ 40 ఏళ్ళు దాటితే వారి వయసు యువ హీరోయిన్స్ కి సూట్ కాదని అనుకుంటూ ఉంటారు.
ఒక వేళా పాడాల్సి వస్తేహ్ మురారి సినిమాలో జిక్కి పాడినట్టుగా అలనాటి రామచంద్రుడు లాంటి వర్సటైల్ పాటలను పడుతూ ఉంటారు.

అయితే మరి వయసు పెద్దగా అయితే గాత్రం లో వచ్చే మార్పులతో వారు పాటలకు దూరం కావాల్సిందేనా అంటే ఖచ్చితంగా లేదు.సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో టెక్నలాజి ఉపయోగించి 80 ఏళ్ళ వారు పాడిన 20 ఏళ్ళ వయసు లో పాడినట్టే అనిపించే విధంగా టెక్నలాజి వచ్చేసింది.ఈ టెక్నలాజిని పుణికి పుచ్చుకున్న మొదటి సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్.
దాంతో సీనియర్ సింగర్స్ తో పాటలు పట్టిస్తున్నారు.మరో ముఖ్యం గా చెప్పుకోవాల్సిన సంఘటన 62 ఏళ్ళ వయసులో సింగర్ జానకమ్మ సెప్టెంబర్ మాసం అంటూ సఖి సినిమాలో పాట పాడితే అచ్చం 20 ఏళ్ళ యువ సింగర్ పాడినట్టే ఉంటుంది.
ఇదే పాటను ఆశా భోస్లే సెప్టెంబర్ మాదం అంటూ అలైపాయుథే లో 2000 ల సంవత్సరం లో పాడారు.