దాదాపు అందరి వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు ఒకటి.రుచికి చేదుగా ఉన్నా మెంతుల్లో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్యపరంగా మెంతులు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే జుట్టు సంరక్షణకు సైతం మెంతులు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.
ముఖ్యంగా మెంతులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా హెయిర్ సీరం తయారు చేసుకుని వాడితే మీరు ఊహించని ప్రయోజనాలు మీ సొంతమవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం మెంతులతో హెయిర్ సీరంను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు రెండు టేబుల్ స్పూన్లు మెంతి పొడి వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన హెయిర్ సీరం సిద్ధమవుతుంది.ఈ హెయిర్ సీరం జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని రెండు గంటల పాటు వదిలేయాలి.అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.

వారంలో ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ సీరంను కనుక వాడితే జుట్టు రాలడం, చిట్లడం, విరగడం వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.చుండ్రు సమస్య దూరం అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.ఒకవేళ తెల్ల జుట్టు ఉన్న క్రమంగా నల్లగా మారుతుంది.తలలో ఇన్ఫెక్షన్, దురద వంటివి ఉంటే తగ్గుముఖం పడతాయి.
మరియు కురులు సూపర్ సిల్కీ గా మెరుస్తాయి.కాబట్టి తప్పకుండా ఈ హోమ్ మేడ్ హెయిర్ సీరంను తయారు చేసుకునే వాడేందుకు ప్రయత్నించండి.







