ఈ పొడిని రోజుకు ఒక్క స్పూన్ తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు అన్న మాటే అనరు!

మోకాళ్ళ నొప్పులు.ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని అత్యంత సర్వసాధారణంగా వేధిస్తున్న సమస్య ఇది.

 Taking This Powder Daily Will Reduce Knee Pain! Knee Pain, Knee Pain Treatment,-TeluguStop.com

మోకాళ్ళ నొప్పుల కారణంగా ఏ పని సరిగ్గా చేయలేకపోతుంటారు.ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పులను వదిలించుకోవడం కోసం ఎన్నో మందులు వాడుతుంటారు.

అయితే సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే పొడి ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ పొడిని రోజుకు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే మోకాళ్ల నొప్పులు అన్నమాట అనరు.మరి ఇంకెందుకు ఆలస్యం మోకాళ్ళ నొప్పులను తరిమికొట్టే ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఫూల్ మఖానా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు బాదం, ఒక కప్పు వాల్ నట్స్, ఒక కప్పు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి.

అలాగే అరకప్పు నువ్వులు, అర కప్పు గుమ్మడి గింజలు కూడా వేసి వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజలు, నువ్వులు, జీడిపప్పు, బాదంపప్పు, వాల్ నట్స్, ఫూల్ మఖానా వేసుకోవాలి.

Telugu Tips, Knee Pain, Latest-Telugu Health

అలాగే నాలుగు యాలకులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలల్లో తయారుచేసి పెట్టుకున్న పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తాటి బెల్లం పొడి వేసి బాగా కలిపి సేవించాలి.

Telugu Tips, Knee Pain, Latest-Telugu Health

ఈ పొడిని ప్రతిరోజు క‌నుక ఇప్పుడు చెప్పిన విధంగా తీసుకుంటే ఎముకలు దృఢంగా బలంగా మారతాయి.దాంతో మోకాళ్ళ నొప్పి సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.అలాగే ఈ పొడిని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.గుండె ఆరోగ్యంగా మారుతుంది.మరియు బ్రెయిన్ సూపర్ షార్ప్ గా సైతం పని చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube