రాహుల్ అమెరికా పర్యటన : సిక్కులపై వ్యాఖ్యలు... గురుపత్వంత్ మద్ధతు, మండిపడ్డ బీజేపీ

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) అమెరికా పర్యటన దుమారం రేపుతోంది.అమెరికాలోని ప్రవాస భారతీయులు, మీడియాతో మాట్లాడుతూ.

 Sfj Backs Congress Leader Rahul Gandh's Remarks On Sikhs During Us Tour ,rahul-TeluguStop.com

బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన చేస్తున్న విమర్శలు చర్చనీయాంశమయ్యాయి.వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.

భారత్‌లో ప్రజాస్వామ్యం గడిచిన పదేళ్లలో విచ్ఛిన్నమైందన్నారు.

Telugu America, Amit Malviya, Amit Shah, Congress, Democracy, Gurpatwantsingh, R

తాము ఎన్నికల్లో పోటీ చేసేముందు మా పార్టీ బ్యాంక్ ఖాతాలు స్తంభించిపోయాయని రాహుల్ తెలిపారు.తనపై దాదాపు 20 కేసులు పెట్టారని, పరువు నష్టం దావా కేసులో జైలుశిక్షను ఎదుర్కొన్నానని , మా ముఖ్యమంత్రి ఒకరు జైల్లోనే ఉన్నారని ఆయన చెప్పారు. భారత్‌లో ప్రజాస్వామ్యం నిలబెట్టేందుకు పోరాటం జరుగుతోందని రాహుల్ తెలిపారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా.బీజేపీ ఎదురుదాడికి దిగింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah ) మాట్లాడుతూ.రాహుల్ గాంధీ దేశంలో రిజర్వేషన్‌లను రద్దు చేయాలని అంటున్నారని ఫైర్ అయ్యారు.

తద్వారా కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక విధానాన్ని ఆయన తెరపైకి తెచ్చారని షా మండిపడ్డారు.భారత వ్యతిరేక శక్తులకు రాహుల్ అండగా నిలుస్తున్నారని అమిత్ షా ఆరోపించారు.

ఈ నేపథ్యంలో సిక్కు వేర్పాటువాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్ ’ (ఎస్ఎఫ్‌జే) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ స్పందించారు.భారత్‌లో సిక్కుల ఆందోళనలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ఆయన మద్ధతుగా నిలిచారు.

భారత్‌లో సిక్కుల అస్తిత్వ ముప్పుపై రాహుల్ చేసిన ప్రకటన వాస్తవమన్నారు.

Telugu America, Amit Malviya, Amit Shah, Congress, Democracy, Gurpatwantsingh, R

ఆ వెంటనే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ( Amit Malviya ) స్పందించారు.నిషేధిత ఖలిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్.అమెరికాలోని సిక్కు సమాజంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు మద్ధతు పలికిందని ఫైర్ అయ్యారు.

ఇల్హాన్ ఒమర్ తర్వాత, భారత వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ కుమ్మక్కు కావడం ఇది తాజా ఉదాహరణ అని అమిత్ ఎద్దేవా చేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube