కొంతమంది దర్శకులు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వరుస సినిమాలను చేస్తూ వాళ్ళ స్పీడ్ చూపిస్తుంటారు.కానీ మరి కొంతమంది దర్శకులు మాత్రం స్లోగా సినిమాలను చేస్తూ సక్సెస్ లను అందుకుంటు ముందుకు దూసుకెళ్తుంటారు.
ఇక ఇంకొంతమంది దర్శకులు మాత్రం స్టార్ హీరోలను నమ్ముకొని వాళ్ళ కోసమే ఎక్కువ రోజులపాటు సమయాన్ని కేటాయిస్తూ ఒక్క సినిమా మీదనే వాళ్ళ సమయం మొత్తాన్ని కేటాయిస్తూ ఉంటారు.ఇక అలాంటి వాళ్ళలో సుజీత్( Sujeeth) ఒకరు.
ఈయన ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం రెండు సినిమాలను మాత్రమే రిలీజ్ చేశాడు.అందులో ఒకటి ‘రన్ రాజా రన్( Run Raja Ru )’ కాగా, మరొకటి సాహో సినిమా కావడం విశేషం…

నిజానికి రన్ రాజా రన్ సూపర్ హిట్ అయిన తర్వాత ప్రభాస్( Prabhas ) అతనికి పిలిచి మరి సినిమా ఛాన్స్ ఇచ్చాడు.దానివల్ల ప్రభాస్ కోసం ఆయన దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు వెయిట్ చేశాడు.ఎందుకంటే అప్పుడు ప్రభాస్ బాహుబలి సినిమా షూటింగ్ లో బిజి గా ఉన్నాడు.
కాబట్టి ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వక ముందే ఈ సినిమా మీద తన సమయాన్ని కేటాయించలేడు అందువల్లే రెండు నుంచి మూడు సంవత్సరాలు పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే పట్టింది.ఇక దానికోసం దాదాపు రన్ రాజా రన్ వచ్చిన ఐదు సంవత్సరాలకి సాహో సినిమా రిలీజ్ అయింది.
ఇప్పుడు సాహో సినిమా వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు సమయం కావస్తున్నప్పటికీ మరొక సినిమా మాత్రం ఆయన రిలీజ్ చేయలేకపోయాడు.

అంటే దాదాపు పది సంవత్సరాల కాలంలో కేవలం అయిన రెండు సినిమాలను మాత్రమే రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తో ఓ జి సినిమా చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం కూడా తను వేచి చూడాల్సిన సమయం అయితే వచ్చింది.ఇక ఈ సినిమా ఇప్పటికే 50% షూట్ ని కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో ఏపీలో ఎలక్షన్స్ రావడం పవన్ కళ్యాణ్ విజయం సాధించడం ఉప ముఖ్యమంత్రిగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ఉండటం చక చక జరిగిపోయాయి.
ఇప్పుడు ప్రజల యోగ క్షేమాలు చూస్తూ ఉండడం వల్ల ఓజీ సినిమా రిలీజ్ కూడా లేట్ అవుతుందనే చెప్పాలి…
.