అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)( Federal Bureau of Investigation ) అధిపతిగా భారత సంతతికి చెందిన కాష్ పటేల్( Kash Patel ) నియమితులైన సంగతి తెలిసిందే.డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనకు యూఎస్ సెనేట్ 51-49 తేడాతో ఆమోదముద్ర వేయడంతో కాష్ పటేల్ నియామకం ఖరారైంది.
తద్వారా ఎఫ్‌బీఐ అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తొలి హిందూ, తొలి భారత సంతతి వ్యక్తిగా కాష్ పటేల్ చరిత్ర సృష్టించారు.ఈ నేపథ్యంలో కాష్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు మిన్నంటాయి.
గుజరాత్( Gujarat ) మూలాలున్న తల్లిదండ్రులకు న్యూయార్క్‌లో 1980లో జన్మించారు కాష్ పటేల్.గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా భద్రన్ గ్రామం( Bhadran Village ) అతని పూర్వీకులది.
ఇక్కడి నుంచి వీరి కుటుంబం 70 , 80 ఏళ్ల క్రితం ఉగాండాకు వలస వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.కాష్ పటేల్ .గుజరాత్‌లోని ప్రభావవంతమైన పాటిదార్ కమ్యూనిటీకి( Patidar Community ) చెందినవాడు.పటేల్ కుటుంబ సభ్యులంతా విదేశాల్లోనే స్థిరపడ్డారని పాటిదార్ సంఘం నాయకులు తెలిపారు.
ఆఫ్రికాకు వలస వెళ్లిన తర్వాత భద్రన్‌లోని తమ పూర్వీకుల ఇళ్లను అమ్మేశారని వారు చెప్పారు.

ఆనంద్‌లో ఉన్న ఛో గామ్ పాటిదార్ మండల్ అనే కమ్యూనిటీ సంస్థ తమ వంశావలి (కుటుంబ వృక్షం)ను నిర్వహిస్తుంది.ఈ వంశావలిలో కాష్ పటేల్ తండ్రి ప్రమోద్ పటేల్, అతని సోదరులు , తాత పేరు కూడా ఉన్నాయి.ఆనంద్ జిల్లా బీజేపీ ప్రతినిధి, సంస్థ కార్యదర్శి పటేల్ తెలిపారు.
కాష్ పేరు ఇంకా కుటుంబ వృక్షంలో చేర్చబడనప్పటికీ అతని కుటుంబంలోని 18 తరాల నమోదు వంశావళిలో ఉందని ఆయన వెల్లడించారు.

కాష్ కుటుంబం భద్రన్ గ్రామంలోని మోతీ ఖడ్కి ప్రాంతంలో నివసించేది.కాష్ భారత్‌ను సందర్శించడానికి వచ్చినప్పుడు అతని తదుపరి తరం పేర్లను, అతని స్వంత పేరుతో సహా వంశావళిలో నమోదు చేసేందుకు ఆయన అనుమతి తీసుకుంటామని రాజేష్ పటేల్ చెప్పారు.1970లో ఉగాండా నుంచి బహిష్కరించబడటంతో కాష్ పటేల్ కుటుంబం కొంతకాలం భారత్‌లో తలదాచుకుందని ఆయన పేర్కొన్నారు.అనంతరం కెనడాకు వెళ్లి, అమెరికాకు మకాం మార్చారనే అక్కడే 1980లో కాష్ పటేల్ జన్మించారని రాజేష్ వెల్లడించారు.