చిత్ర నాయర్.( Chitra Nair ) ఈమె గురించి మనందరికీ తెలిసిందే.
మలయాళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది చిత్ర.నటిగా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.
ఇది ఇలా ఉండే తాజాగా ఈమె ఒక ఆర్మీ వ్యక్తితో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.ఆ వివరాల్లోకి వెళితే.
ఆర్మీ ఏవియేషన్ విభాగంలో పనిచేసే లెనీష్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది.వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే( Chitra Nair Second Marriage ) కావడం విశేషం.
ఈ వివాహ వేడుకకు చిత్ర కుమారుడు, లెనీష్ కుమార్తె సహా ఇరువురి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు హాజరయ్యారు.

అలాగే పెళ్లి వీడియోను చిత్ర సోషల్ మీడియాలో షేర్ చేసింది.గతంలో ఒక ఇంటర్వ్యూలో చిత్ర మాట్లాడుతూ.నా కొడుక్కి పద్నాలుగేళ్లు.
తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.నాకు 36 ఏళ్లు.
అందరూ సంతూర్ మమ్మీ( Santoor Mummy ) అని పిలుస్తుంటారు.నా పక్కన ఉన్న కొడుకుని చూసి నా తమ్ముడనుకుంటారు.21 ఏళ్ల వయసులోనే నాకు పెళ్లయింది.అది పెద్దలు కుదిర్చిన సంబంధం.
జాతకాలు అన్నీ చూశాకే నాకు పెళ్లి చేశారు.చివరకు ఏమైంది? ఎనిమిదేళ్ల క్రితం విడాకులు( Divorce ) తీసుకున్నాము అని చెప్పుకొచ్చింది.అయితే తాజాగా ఆమె పెళ్లి చేసుకున్న ఆర్మీ ఆఫీసర్ కి కూడా ఇది రెండవ పెళ్లి అని తెలుస్తోంది.అంటే ఇద్దరికీ ఇది రెండవ పెళ్ళి.

గతంలో చిత్ర నాయర్ ఒక ఉపాధ్యాయునిగా పనిచేసింది.ఆ తర్వాత కరోనా సమయములో సినిమాల వైపు అడుగులు వేసింది.ఆడిషన్స్ కు వెళ్లి తనకంటూ కొత్త దారి నిర్మించుకుంది.మోహన్ లాల్ ఆరట్టు చిత్రంతో నటిగా వెండి తెరకు పరిచయమైంది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ నవ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.