టబు.ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన నటి.ఎన్నో సినిమాల్లో అద్భుత నటనతో మంచి పేరు సంపాదించుకుంది.తన అందాలన్నీ ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులను చవిచూపించింది.
దశాబ్దం పాటు తన హవా కొనసాగించిన ఈ ముదురు భామ.ఆ తర్వాత వెండి తెరకు దూరం అయ్యింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడపాదడపా గెస్ట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది.తాజాగా అల వైకుంఠపురములో సినిమాలో చక్కటి నటన కనబర్చింది.ప్రస్తుతం ఈ అమ్మడు ఓ కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది.ఇంతకీ ఆమె ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం నిర్మాతగా మారబోతుంది.అయితే ఇన్నాళ్లు రాని ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎందుకు వస్తోంది అనేది అందరికీ తలెత్తే ప్రశ్న.అయితే తన ఆనందం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటుందట ఈ బోల్డ్ బ్యూటీ.
ఈ ముద్దుగుమ్మ వయసు 50 ఏండ్లు దాటినా.ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.
మధ్యలో ఓ హీరోతో సన్నిహితంగా ఉన్నది.ఆ తర్వాత తను చాలా మందితో ప్రేమలో పడింది.
కానీ ఎవ్వరినీ తను పెళ్లి చేసుకోలేదు.లేటు వయసులోనూ ఘాటు పాత్రలు చేసింది.
తాజాగా తనకు ఓ దర్శకుడు మంచి కథ చెప్పాడట.ఆ కథ ఆమెకు బాగా నచ్చిందట.
ఈ కథను ఓ వెబ్ ఫిల్మ్ లా చేయాలని టబు భావిస్తుందట.కేవలం కథ నచ్చిన కారణంగానే తను నిర్మాతగా మారబోతున్నట్లు తెలుస్తోంది.ప్రసత్తుం తన నిర్మాణ సంస్థ ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకుంటుందట.ఈ సినిమా ఒక్కటే కాదు.ఇక ముందు మంచి కథలు వస్తే ఇంకా సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతుందట.అయితే బడ్జెట్ తక్కువగా ఉన్న సినిమాలు మాత్రమే చేయాలి అనుకుంటుంది.
అంతేకాదు.ఓటీటీలో విడుదల అయ్యేలా ఆ సినిమాలు ఉండాలంటుంది.
అయితే ఇన్నాళ్లు నటిగా మెప్పించిన టబు.నిర్మాతగా ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.