టబు ఒంటరితనానికి కారణం ఆమె తీసుకున్న షాకింగ్ నిర్ణయమేనా ?

టబు.ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన నటి.

ఎన్నో సినిమాల్లో అద్భుత నటనతో మంచి పేరు సంపాదించుకుంది.తన అందాలన్నీ ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులను చవిచూపించింది.

దశాబ్దం పాటు తన హవా కొనసాగించిన ఈ ముదురు భామ.ఆ తర్వాత వెండి తెరకు దూరం అయ్యింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడపాదడపా గెస్ట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది.తాజాగా అల వైకుంఠపురములో సినిమాలో చక్కటి నటన కనబర్చింది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఓ కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది.ఇంతకీ ఆమె ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం నిర్మాతగా మారబోతుంది.

అయితే ఇన్నాళ్లు రాని ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎందుకు వస్తోంది అనేది అందరికీ తలెత్తే ప్రశ్న.

అయితే తన ఆనందం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటుందట ఈ బోల్డ్ బ్యూటీ.

ఈ ముద్దుగుమ్మ వయసు 50 ఏండ్లు దాటినా.ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

మధ్యలో ఓ హీరోతో సన్నిహితంగా ఉన్నది.ఆ తర్వాత తను చాలా మందితో ప్రేమలో పడింది.

కానీ ఎవ్వరినీ తను పెళ్లి చేసుకోలేదు.లేటు వయసులోనూ ఘాటు పాత్రలు చేసింది.

తాజాగా తనకు ఓ దర్శకుడు మంచి కథ చెప్పాడట.ఆ కథ ఆమెకు బాగా నచ్చిందట.

"""/"/ ఈ కథను ఓ వెబ్ ఫిల్మ్ లా చేయాలని టబు భావిస్తుందట.

కేవలం కథ నచ్చిన కారణంగానే తను నిర్మాతగా మారబోతున్నట్లు తెలుస్తోంది.ప్రసత్తుం తన నిర్మాణ సంస్థ ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకుంటుందట.

ఈ సినిమా ఒక్కటే కాదు.ఇక ముందు మంచి కథలు వస్తే ఇంకా సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతుందట.

అయితే బడ్జెట్ తక్కువగా ఉన్న సినిమాలు మాత్రమే చేయాలి అనుకుంటుంది.అంతేకాదు.

ఓటీటీలో విడుదల అయ్యేలా ఆ సినిమాలు ఉండాలంటుంది.అయితే ఇన్నాళ్లు నటిగా మెప్పించిన టబు.

నిర్మాతగా ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.

జాన్వీ కపూర్ ఎంట్రీతో ఆ హీరోయిన్ కు ఆఫర్లు తగ్గాయట.. అయ్యో పాపం అంటూ?