ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( IRCTC ) అదిరిపోయే జాబ్ ఆఫర్‌తో మీ ముందుకు వచ్చింది.మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగం, పైగా ఇండియన్ రైల్వేస్‌లో జాబ్( Indian Railways Jobs ) అంటే మామూలు విషయం కాదు.వెంటనే IRCTC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేసుకోండి.
దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2025, ఏప్రిల్ 25.చివరితేదీ లోపు మీ అప్లికేషన్ పక్కాగా సబ్మిట్ చేయాల్సిందే.డిగ్రీ పాసైన వారందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్( Qualifications ) ఏంటంటే, ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేట్ డిగ్రీ), బీఎస్సీ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్), బీటెక్ లేదా బీఈ (బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్).

అప్లై చేసుకోవాలనుకునే వారికి మాగ్జిమమ్ ఏజ్ లిమిట్ 55 సంవత్సరాలు.అయితే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు.జస్ట్ మీ మెరిట్( Merit ) ఆధారంగా మిమ్మల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు.ఆ తర్వాత ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.దీని ద్వారా ఫైనల్ సెలక్షన్ చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,400 నుంచి రూ.67,000 వరకు సాలరీ ఇస్తారు.ఇది మీ ఎక్స్‌పీరియన్స్, క్వాలిఫికేషన్స్‌పై ఆధారపడి ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఆఫ్లైన్‌లో ఉంటుంది.అప్లికేషన్ ఫార్మ్ నింపాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని జత చేసి, నోటిఫికేషన్‌లో ఇచ్చిన అడ్రస్‌కు పంపించాలి.చివరి తేదీలోపు మీ అప్లికేషన్ చేరేలా చూసుకోండి.అధికారిక నోటిఫికేషన్ కోసం ఈ లింకు https://irctc.com/assets/images/Vacancy%20Notice%20No.%20DEP-10-2025-GGM%20IT%20CO%2027.03.2025.pdf పై క్లిక్ చేయండి.