తెలుగులో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణి జయసుధ.ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి అద్భుత ఆదరణ దక్కించుకుంది.
అప్పట్లోనే స్విమ్ సూట్ వేసి గ్లామర్ హీరోయిన్ గా సినీ అభిమానులను కనువిందు చేసింది.తాజాగా జయసుధ అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉంటుంది.
తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఎంతో అందంగా కనిపించే ఈ అందాల తార.ప్రస్తుతం చాలా బక్కచిక్కి కనిపిస్తుంది.దీంతో ఆమె అభిమానులు తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.ఎందుకు ఆమె ఆలా తయారైంది అని చర్చించుకుంటున్నారు.
1959 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించిన ఈమె అసలు పేరు సుజాత.పుట్టి పెరిగింది మద్రాసులో అయినా అచ్చ తెలుగు అమ్మాయిగానే ఎదిగింది.ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు అయిన విజయ నిర్మల ఈమెకు స్వయంగా చిన్నమ్మ అవుతుంది.అందుకే చిన్నప్పటి నుంచి తనతో కలిసి సినిమా షూటింగులకు వెళ్లేది.నెమ్మదిగా బాల నటిగా సినిమా రంగంలోకి అడగు పెట్టింది.1972లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో తెరకెక్కిన పండంటి కాపురం జయసుధ కెరీర్ లో తొలి సినిమా.తన కెరీర్ లో సుమారు 300 సినిమాల్లో నటించింది.
అందులో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉంది.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో 25 సినిమాలు చేసింది.
దాసరి దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించింది.అప్పట్లో జయసుధ ఒకే ఏడాది 25 సినిమాల్లో నటించి సంచలనం కలిగించింది.

1985లో నితిన్ కపూర్ ను జయసుధ పెళ్ళి చేసుకుంది.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.వారిలో ఒకరు నిహార్, మరొకరు శ్రేయంత్.2001లో జయసుధ క్రైస్తవంలోకి మారింది.ఆ తర్వత తన భర్త నితిన్ అనారోగ్యంతో కన్నుమూశాడు.ప్రస్తుతం ఈమె అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉంటుంది.తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు సాయం చేసేందుకు ఆమె ఓ స్వచ్చంద సంస్థను కూడా స్థాపించింది.ప్రస్తుతం ఆమె ఫోటోను చూసి అభిమానులు.
ఎందుకు అలా మారింది అనే విషయంపై చర్చించుకుంటున్నారు.