ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) లో ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఓ యువ ఆటగాడు అభిషేక్ శర్మ.( Abhishek Sharma ) లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా తనదైన శైలితో ప్రతి మ్యాచ్‌లో విలక్షణ ప్రదర్శన చూపుతూ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాడు.
పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ 2018లో ఐపీఎల్‌కు అరంగేట్రం చేశాడు.అప్పటి నుంచే తన ఆటతీరు, ధైర్యసాహసాల బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు.
అతని మెంటర్ యూవరాజ్ సింగ్,( Yuvraj Singh ) భారత క్రికెట్‌లో ఎటువంటి ముద్ర వేశాడో ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు.యువరాజ్ ప్రభావం అభిషేక్ ఆటతీరులో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.అతడు 55 బంతులు ఆడి 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141 పరుగులు బాదాడు.40 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు కూడా.ఈ విజయం ద్వారా హైదరాబాద్( Hyderabad ) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.
ఈ విజయానికీ, శతకానికి పునాది ఆరంభంలోనే పడిపోయింది.అభిషేక్ శర్మ మైదానంలోకి దిగేముందే తన లక్ష్యం స్పష్టంగా నిర్ణయించుకున్నాడు.ఈరోజు శతకం చేయాలని గట్టిగా నిర్ణించుకున్నాడు.ఈ నిర్ణయాన్ని కేవలం మనసులోనే కాకూండా, కాగితంపై కూడా రాసుకున్నాడు.
ఆ కాగితం తన జేబులో పెట్టుకుని మ్యాచ్ ఆడేందుకు రంగంలోకి దిగాడు.శతకం చేసిన తర్వాత, ఆ కాగితాన్ని చూపిస్తూ తన సంకల్పాన్ని అందిరికి చూపించాడు.
ఇది అభిమానుల్లో మంచి రెస్పాన్స్ ను అందించింది.
ఆట ప్రారంభమైన నుంచి చివరివరకు అభిషేక్ శర్మ ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఏ మాత్రం కనికరం చూపించలేదు.ఒక్కో బంతిని గ్రౌండ్ నలుమూలలుగా పంపిస్తూ స్టేడియాన్ని ఊపేశాడు.అటు ఫోర్లు, ఇటు సిక్సర్లతో ఉప్పల్ మైదానాన్ని సందడిగా మార్చేశాడు.
ఈ మ్యాచ్‌లో సాధించిన విజయంతో హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలై తీవ్ర ఒత్తిడిలో ఉన్న హైదరాబాద్ జట్టు, ఈ విజయం ద్వారా పాయింట్ల పట్టికలో తన స్థానం మెరుగుపరచుకుంది.
పంజాబ్ జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా తన ఆటతీరు ఎంత బలంగా ఉన్నదో హైదరాబాద్ నిరూపించుకుంది.