అమ్మాయిల కళ్లను మరింత అందంగా చూపించడంలో ఐలైనర్ ముఖ్య పాత్రను పోషిస్తుంది.అందుకే కళ్లకు కాటుక, మస్కారాలతో పాటు ఐలైనర్‌ను కూడా తప్పకుండా పెట్టుకుంటారు.
ఇకపోతే ఐలైనర్ వేసుకోవడం సులువే.కానీ, దాన్ని ఎక్కువ సమయం పాటు నిలుపుకోవడం ఎంతో కష్టం.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్ పాటిస్తే గనుక ఐలైనర్ రోజంతా మీ కళ్లకే అంటిపెట్టుకుని ఉంటుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో ఓ చూపు చూసేయండి.
ఐలైనర్‌ను ఎక్కువ సేపు ఉండేలా చేయడంలోనూ ప్రైమర్ సూపర్‌గా సహాయపడుతుంది.మేకప్ వేసుకోవడానికి ప్రైమర్ వాడినట్టుగానే.
ఐలైనర్ పెట్టుకోవడానికి ముందు ఐ ప్రైమర్ వాడాలి.తద్వారా ఐలైనర్ ఎక్కువ సమయం ఉండడమేగాక, కళ్లు మరింత అందంగా కనిపిస్తాయి.

ఐలైనర్ పెట్టుకున్నాక మీరు వాడే టాల్కమ్ పౌడర్ ను అద్దీ అద్దనట్లుగా అద్దాలి.ఇలా చేసినా కూడా ఐలైనర్ చెదిరి పోకుండా ఉంటుంది.అలాగే ఐలైనర్‌ను ఒక కోటింగే వేస్తే.ఇట్టే పోతుంది.అందువల్ల, లిప్‌స్టిక్ మాదిరిగా ఐలైనర్‌ను రెండు లేదా మూడు సార్లు కోటింగ్‌లు వేసుకోవాలి.దాంతో ఐలైనర్ మరింత బ్రైట్‌గా కనిపించడమేగాక.
కళ్లు పెద్దవిగానూ కనిపిస్తాయి.
చాలా మంది తెలిసో తెలియకో మాయిశ్చరైజర్ ను ముఖంతో పాటు కళ్లు, కనురెప్పల చుట్టూ కూడా అప్లై చేస్తుంటారు.
దీని వల్ల ఐలైనర్ వేసుకున్న కొద్ది క్షణాలకే పోతుంది.కాబట్టి, ఇకపై మాయిశ్చరైజర్‌ను కళ్లు, కనురెప్పల చుట్టూ రాయవద్దు.
అలాగే ఐలైనర్ వేసుకున్నా ఐషాడో పైపైన దిద్దినా కూడా ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటుంది.ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే.
మార్కెట్లో వివిధ రకాల ఐలైనర్‌లు దొరుకుతుంటాయి.కానీ, ఐలైనర్ రోజంతా నిలిచి ఉండాలంటే వాటర్ ప్రూఫ్ మరియు బ్రాండెడ్ దే ఎంచుకోవాలి.