మద్యం సేవించన తర్వాత చాలా మంది హ్యాంగోవర్ సమస్యతో బాధ పడుతుంటారు.అతిగా మద్యం సేవించడం వల్ల ఈ సమస్య వస్తుంది.
తలనొప్పి, వికారం, బద్ధకం, అలసట, నీరసం, ఏ పని చేయాలనిపించకపోవటం, శబ్దాలను భరించలేకపోవడం హ్యాంగోవర్ ప్రధాన లక్షణాలుగా చెప్పొచ్చు.ఈ లక్షణాలన్నీ తాగిన మత్తు దిగిన తర్వాత కనిపిస్తాయి.
ఆ సమయంలో చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది.ఇక దురదృష్టకరమైన విషయం ఏంటంటే… హ్యాంగోవర్‌ను తగ్గించేందుకు ఎలాంటి మందులు లేవు.
కానీ, కొన్ని కొన్ని టిప్స్ పాటించి.హ్యాంగోవర్ నుంచి సులువుగా బయటపడొచ్చు.మరి హ్యాంగోవర్‌ను తగ్గించే ఆ టిప్స్ ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.మద్యం తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంటుంది.
ఈ డీహైడ్రేషన్ కారణంగా హ్యాంగోవర్ ఏర్పడుతుంది.అందువల్ల, శరీరాన్ని హైడ్రేటడ్‌గా ఉంచుకోవాలి.
అలా ఉంచుకోవాలి అంటే ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.ముఖ్యంగా కొబ్బరి నీరు, మజ్జిగ, పళ్ల రసాలు, వాటర్ వంటివి ఎక్కువగా తీసుకుంటే హ్యాంగోవర్ సమస్య దూరం అవుతుంది.

విటమన్ సి హ్యాంగోవర్‌ను తగ్గించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.అందువల్ల, ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ లేదా గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి సేవిస్తే.హ్యాంగోవర్ నుంచి మంచి ఉశమనం లభిస్తుంది.అలాగే హ్యాంగోవర్‌తో తీవ్రంగా వచ్చే తలనొప్పి, వికారం వంటి సమస్యలకు చెక్ పెట్టడంలో అల్లం టీ కూడా సూపర్‌గా వర్క్ అవుట్ అవుతుంది.
కాబట్టి, ఆ సమయంలో వేడి వేడిగా ఒక కప్పు అల్లం టీ తాగేసేయండి.
అదేవిధంగా, ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే.హ్యాంగోవర్ నుంచి సులువగా విముక్తి పొందగలరు.ఇక అరటిపండు కూడా హ్యాంగోవర్ లక్షణాల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.కాబట్టి, ఆ సమయంలో ఒక్క గ్లాస్ అరటి పండు జ్యూస్ సేవిస్తే.అందులో ఉండే పొటాసియం మరియు కార్బోహైడ్రేట్స్ హ్యాంగోవర్‌ను తగ్గిస్తుంది.
ఒకవేళ మద్యం సేవించే ముందు అరటి పండు తింటే.అసలు హ్యాంగోవర్ సమస్యే ఉండదు.