వ‌ర్షాకాలంలో చ‌ర్మం త‌ర‌చూ డ్రైగా మారుతుందా? అయితే ఇలా చేయండి!

వేస‌వి వేడి నుండి ఉప‌శ‌మ‌నాన్ని అందించే వ‌ర్షాకాలం రానే వ‌చ్చింది.అయితే ఈ సీజ‌న్‌లో వ‌చ్చే వాతావ‌ర‌ణ మార్పులు, వ‌ర్షంలో అధికంగా త‌డ‌వ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల కొంద‌రి ముఖ చ‌ర్మం త‌ర‌చూ డ్రైగా మారిపోతుంటుంది.

 How To Get Rid Of Dry Skin In Rainy Season! Dry Skin, Rainy Season, Skin Care, S-TeluguStop.com

చ‌ర్మంలో తేమ త‌గ్గిపోవ‌డం వ‌ల్ల అలా జ‌రుగుతుంది.ఫ‌లితంగా దుర‌ద‌, చికాకు, వివిధ ర‌కాల అల‌ర్జీలు వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

ఈ క్ర‌మంలోనే డ్రై స్కిన్ సమస్యను తగ్గించుకునేందుకు మార్కెట్లో లభించే రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు.

అయిన‌ప్ప‌టికీ ఎలాంటి ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక తెగ మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

ఈ లిస్ట్ లో మీరు ఉన్నారా.అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.

ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే క్రీమ్‌ను ట్రై చేస్తే పొడి చ‌ర్మం స‌మ‌స్య‌ను సుల‌భంగా వ‌దిలించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ క్రీమ్ ఏంటో.

దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

Telugu Tips, Cream Dry Skin, Dry Skin, Latest, Natural Cream, Rainy Season, Skin

ముందుగా ఒక క‌ల‌బంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి.ఈ క‌ల‌బంద ముక్క‌ల‌ను మిక్సీ జార్ లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకుని జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ను క‌లిపి చిక్క‌బ‌డే వ‌ర‌కు ఉడికించి చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మంలో వ‌న్ టేబుల్ స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ జెల్, వ‌న్ టేబుల్ స్పూన్ ఆముదం, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్‌ను ఏదైనా బాక్స్‌లో నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు యూస్ చేసుకోవ‌చ్చు.

ఈ క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే చ‌ర్మం తేమ‌గా మారుతుంది.దాంతో డ్రై స్కిన్ స‌మ‌స్య నుంచి ఈజీగా బ‌య‌ట‌ప‌డొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube