టాలీవుడ్ హీరో, విలన్ మోహన్ బాబు( Mohan Babu ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు మోహన్ బాబు.
ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు.ప్రస్తుతం కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు మోహన్ బాబు పేరు సోషల్ మీడియాలో( social media ) మారు మోగిపోయింది.అందుకు గల కారణం ఆయన ఇంట్లో జరిగిన గొడవలే.
ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే విడుదల కాబోతున్న మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో( Kannappa ) మోహన్ బాబు ఉన్న నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే మోహన్ బాబు లుక్కుకి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేశారు.ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.శోభన్ బాబు గారి సినిమా కూతురు కోడలుకి మా గురువు గారు దాసరి నారాయణ రావు ( Dasari Narayana Rao )కో డైరెక్టర్.
నేను అప్రంటీస్ ని.ఆ సినిమాకు ఆరు నెలలు పనిచేస్తే 50 రూపాయలు జీతం ఇచ్చారు.అప్పటీ నుంచే దాసరి గారితో పరిచయం ఉంది.

ఆ పరిచయంతో ఆయన్ని ఛాన్స్ లు అడిగేవాడిని.నాకు పెళ్లి అయి మద్రాస్ లో కాపురం పెట్టాను.అలా పెళ్ళైన 13 రోజులకే దాసరి గారు డైరెక్ట్ చేస్తున్న సినిమాకు ఆడిషన్స్ కి రమ్మన్నారు.
విజయవాడలో ఆడిషన్స్.మా ఆవిడకు చెప్తే హీరోగా సెలక్ట్ అవుతారు వెళ్లి రండి అన్నారు.
నేను వెళ్లి ఆడిషన్ ఇచ్చి వచ్చాను.వేరే అసోసియేట్ డైరెక్టర్స్ తీసుకున్నారు ఆడిషన్.
నాకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో ఫైనల్ సెలెక్ట్ అయిన వాళ్ళల్లో నేను లేను.నన్ను పక్కన పెట్టేసారు.
కానీ తర్వాత దాసరి గారి భార్య వల్ల నేను ఆడిషన్ ఇచ్చిన క్లిప్ దాసరి గారి కంట్లో పడి ఈ అబ్బాయి బాగా చేసాడు అని పిలిపించి ఛాన్స్ ఇచ్చారు.అలా నా మొదటి సినిమా స్వర్గం–నరకం ఛాన్స్ వచ్చింది.
ఆ సినిమా పెద్ద హిట్ అయింది.ఆ సినిమా తర్వాత నటుడిగా నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు అని తెలిపారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మారాయి.