కరోనావైరస్ మన దగ్గరికి రాకూడదు అనుకుంటే మన అందరి దగ్గర ఒక శానిటైజర్ బాటిల్ ఉండడం తప్పనిసరి రోజులివి.అందుకే ఇప్పుడు శానిటైజర్ కూడా ఒక నిత్యావసర వస్తువుగా మారింది.
అయితే ఆ శానిటైజర్‌తో కూడా కొన్ని రిస్క్‌లున్నాయి.దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మొదటికే ముప్పు వస్తుందంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
ఇలాంటి శానిటైజర్ ను కళ్ల దగ్గర, ముక్కు దగ్గర, నోటి దగ్గర, రాసుకుంటే తప్పులేదు కదా అని కొందరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO ) సంస్థను ప్రశ్నిస్తున్నారు.
చేతులు కడుక్కోడానికి ఉపయోగపడిన శానిటైజర్ ముక్కు దగ్గర, కళ్ల దగ్గర, నోటి దగ్గర రాసుకుంటే సరిపోయే దానికి మూతులకు మాస్కులు కట్టుకొని గాలి ఆడక బాధపడుతున్నామని వాపోతున్నారు.
దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ సమాధానంగా హ్యాండ్ శానిటైజర్, ఆల్కహాల్, క్లోరిన్ వంటి వాటిని శరీరంపై చల్లుకోవడం వల్ల అవి శరీరం లోపల ఉన్న కరోనా వైరస్ ని చంపలేవని తెలిపింది.అలాగే, వాటిని చల్లుకుంటే బట్టలు, కళ్లు, ముక్కు, నోటికి చాలా ప్రమాదమని తెలియజేసింది.
ఈ ఆల్కహాల్, క్లోరిన్ అనేవి బయటి ప్రదేశాలపై ఉండే కరోనా వైరస్ ని తరిమేసేందుకే వాడుతారన్న విషయం గుర్తుంచుకోమంది.అలాగే కెమిస్టుల సూచనల మేరకే వాటిని వాడాలని చెప్పింది.
బయట మార్కెట్లో వివిధ రకాలైన శానిటైజర్ లు లభ్యమవుతున్నాయి.ఏ శానిటైజర్ వాడినా మనము డాక్టర్ సలహా తో వాడటం చాలా వరకూ ఉపయోగము.
మన ఇష్టము వచ్చినట్లు వాడితే మనకే ప్రమాదము.ఈ మధ్యనే శానిటైజర్ లో ఆల్కహాలు ఉంటుందని మందుబాబులు తాగడం వలన చాలా మంది మృత్యువాత పడ్డారు.
శానిటైజర్ వాడకంలో తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమనగా… పొడిగా ఉన్న చేతులపైనే శానిటైజర్ పనిచేస్తుంది.జిడ్డుగా ఉన్న చేతులపైన శానిటైజర్ రాసుకుంటే ఎలాంటి ఉపయోగం లేదు.
జిడ్డు సర్ఫేస్ మీద శానిటైజర్ పని చేయదని, పైగా చేతులు జిడ్డుగా ఉంటే.మరింత డస్ట్ చేతులకు అంటుకుంటుంది కూడా అని తెలుపుతున్నారు నిపుణులు.
ఇంకా తడిగా ఉన్న చేతులపై కూడా శానిటైజర్ ఎఫెక్ట్ అంతగా ఉండదని కొందరు డాక్టర్లు సూచనలు చెప్తున్నారు.