పాదాల పగుళ్లు. అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.
అందులోనూ ప్రస్తుత చలికాలంలో పాదాల పగుళ్లు సమస్య అనేది మరింత అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.అయితే కొందరిలో పాదాల పగుళ్ల సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది.
పాదాల పగుళ్ల వల్ల భరించలేని నొప్పిని అనుభవిస్తుంటారు.పాదాల పగుళ్ళ కారణంగా నడవడానికి కూడా కష్టంగా మారుతుంది.
దీంతో పాదాల పగుళ్ల సమస్యను వదిలించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.

మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసి పాదాల పగుళ్లను నివారించుకోవడం కోసం వినియోగిస్తుంటారు.అయినా సరే ఎలాంటి ఫలితం దక్కకుంటే ఏం చేయాలో తెలీక తెగ హైరానా పడిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే రెండు రోజుల్లోనే పాదాల పగుళ్ల నుంచి విముక్తి పొందవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటి అనేది ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్ వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.రోజూ ఉదయం మరియు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న మిశ్రమాన్ని పగుళ్లపై అప్లై చేసుకోవాలి.
ఇలా చేస్తే రెండు రోజుల్లోనే పాదాల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.పాదాలు మళ్లీ మృదువుగా కోమలంగా మారతాయి.కాబట్టి ఎవరైతే పాదాల పగుళ్ల సమస్యతో తీవ్రంగా మదన పడుతున్నారో తప్పకుండా వారు పైన చెప్పిన రెమెడీని పాటించండి.పాదాల పగుళ్లకు బై బై చెప్పండి.