చాలామందికి పగటి పూట కంటే రాత్రి సమయంలో ఆకలి ఎక్కువగా అవుతుంది.ఎందుకంటే చాలామంది త్వరగా తిని ఆలస్యంగా పడుకోవడం అది కాకుండా బరువు తగ్గడం కోసం తక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా రాత్రిపూట ఆకలి వేస్తోంది.
ఇలా ప్రతి ఒక్కరికి రాత్రి సమయాన ఆకలి వేయడం సహజం.దానివల్ల సరిగ్గా నిద్ర కూడా పట్టదు.
ఇక మధ్య రాత్రిలో ఆకలి వేసినప్పుడు ఏది పడితే అది తినకూడదు.ఒకవేళ తినాలనిపిస్తే ఈ క్రింది పదార్థాలను తినాలి.
రాత్రి సమయంలో ఎక్కువగా మసాలాలు, నూనెలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోకుండా తృణధాన్యాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.అంతేకాకుండా పండ్లను కూడా తినవచ్చు.ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి ఏ రకమైన పండు నైనా తినవచ్చని సూచిస్తున్నారు.కానీ ఎక్కువగా పులుపు ఉండే పండ్లను తినకూడదు.
వాటివల్ల మధ్యరాత్రి కడుపులో యాసిడ్ లెవెల్స్ పెరుగుతుంటాయి.

అంతేకాకుండా పులుపు లేని పెరుగు తీసుకోవడం మరీ మంచిది.దీనివల్ల మధ్యరాత్రి ఆకలి సమస్య తీరిపోతుంది.అంతే కాకుండా అందులో ఓట్స్ లేదా ఫ్రూట్స్ కూడా కలుపుకొని తీసుకోవచ్చు.
అంతేకాకుండా రాగులతో తయారు చేసిన బిస్కెట్లను కూడా తినవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.నూనెలో వేయించిన పదార్థాలు రాత్రి సమయంలో ఎక్కువగా తీసుకోకూడదు.
అర్ధరాత్రివేళ జీర్ణక్రియ వ్యవస్థ నెమ్మదిగా జరుగుతుంది.అందుకే ఎక్కువ నూనె పదార్థాలు, మాంస పదార్థాలు తినకూడదు.
ఇక డ్రైఫ్రూట్స్ వంటి పదార్థాలను తీసుకున్న నష్టమేమీ లేదు అంటున్నారు వైద్య నిపుణులు.ఇదే కాకుండా మార్కెట్లో దొరికే కొన్ని యోగార్ట్ రకాల పదార్థాలు రాత్రి సమయంలో తీసుకుంటే మంచిదేనని తెలుపుతున్నారు.
వీలైనంత వరకు వీటిని అందుబాటులో ఉంచుకోవడం మంచిదని తెలుపుతున్నారు.