హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రంలో శ్రీ మహా విష్ణువు శయనించే శేష తల్పమే ఆది శేషుడు.సర్పాలకు ఆద్యుడు, రారాజు.ఇతని అంశలోనే రామాయణంలో లక్ష్మణుడు జన్మించాడు.పురాణాల ప్రకారం సమస్త భూ మండలాలు ఆది శేషుడు తన పడగపై మోస్తున్నాడు.వేయి పడగల నుంచీ నిత్యం విష్ణు కీర్తి వినిపిస్తూ ఉంటుంది.ఈ సర్పానికే అనంత శేషుడనే పేరు కూడా ఉంది.
శేషుడు కద్రువ కుమారుడు.తండ్రి కశ్యపుడు.
తన తల్లి వినతను, తమ్ములకు చేసిన అధర్మానికి కుపితుడై వారిని విడిచి బ్రహ్మను గురించి తపస్సు చేసాడు.బ్రహ్మ ప్రత్యక్షం అయి నీవు సత్య ధర్మ నిరతుడవు.
నీవు భూ భారాన్ని వహించు, గరుడునితో సఖ్యము చేయుమని ఆదేశించాడు.భృగు మహర్షి శాపం వల్ల బల రామావతారం కలుగుతుంది.
శేషుడు సర్గములో విష్ణుని ద్వారము వద్ద కాపలా కాస్తుండగా, విష్ణు దర్శనార్దం వచ్చిన వాయువును అడ్డగించగా, గరుడుని తిరస్కరించి ముందుకు పోవడానికి ప్రయత్నించగా వారి రువురికి పోరాటానికి దిగి తమ బలాన్ని పరీక్షించు కోవడం ప్రారంభించారు.సందిడికి విష్ణువు బయటకు వచ్చి, శేషుడు మేరువు కుమారుడైన వెంకటాద్రిని చుట్టుకున్నాడు.
వాయువు దానిని కదల్చాలి.కదిలితే వాయువు, కదలక పోతే శేషుడు బలవంతుడని చెప్పెను.
శేషువు వెంకటాద్రిని గట్టిగా చుట్టుకొనగా వాయువు దానిని కదలి దూరంగా విసిరాడు.శేషువు చింతతో స్వర్గానికి పోవక విచారంతో ఉండగా విష్ణువు అతనిని ఓదార్చాడు.
శేషుడు అదే ఉండడంతో అదే శేషాద్రి అయ్యిందని వెంకటేశ్వర మహత్మ్యంలో చెప్పబడింది.