ఈ మధ్యకాలంలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.ఈ సంక్రాంతి లోపు ఒక కొడుకు ఉన్న తల్లి, ఇద్దరు అంతకంటే ఎక్కువ కొడుకులు ఉన్న వాళ్ళ చేత డబ్బులు తీసుకుని, ఐదు రకాల రంగు గాజులను ( bangles )కొనుక్కొని చేతికి వేసుకోవాలని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఇలా చేయకపోతే అరిష్టం జరుగుతుందని కూడా చెబుతున్నారు.దీంతో అది తల్లికి, బిడ్డకి ఇద్దరికీ కూడా మంచిది కాదని కూడా సరికొత్తగా ఈ వార్తను చాలా మంది ప్రచారం చేస్తూ ఉన్నారు.
అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఈ న్యూస్ వ్యాపించింది.

దీంతో ఇరుగుపొరుగు వారు తెలిసిన వారు ఒకరి నుండి ఒకరికి వార్తా బాగా స్ప్రెడ్ చేశారు.దీంతో సంక్రాంతి లోపు అలా డబ్బులు తీసుకుని గాజులు వేసుకోవాలి అని ఆడవాళ్లు పక్కన ఉండే ఆడవాళ్ళ చేత ఇద్దరు కొడుకులు ఉండే తల్లుల చేత డబ్బులు తీసుకొని, ఒక కొడుకు ఉన్న తల్లి ఐదు రంగుల గాజులను రెండు చేతులకి వేసుకుంటూ ఉన్నారు.అయితే పలువురు పండితులు మాత్రం దీన్ని కొట్టి పాడేస్తున్నారు.
అయితే దీని గురించి పండితులు( Scholars ) ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్క కొడుకు ఉన్న తల్లి ఇలా ఇద్దరు లేదా ముగ్గురు కొడుకులు ఉండే తల్లి చేత డబ్బులు తీసుకొని ఐదు రంగుల గాజులను ధరించాలన్న విషయం వాస్తవానికి సరైనది కాదు.అసలు ఇది నిజం కాదు.అలాంటిది ఏమీ లేదనీ చెప్పారు.
కానీ మరికొందరు మాత్రం అలా వేసుకోవడం మంచిదే అని, గాజులు ఆడవాళ్ళ సౌభాగ్యంకి గుర్తు అని, ఓ పుణ్యస్త్రీ మరో పుణ్య స్త్రీకి మట్టి గాజులు ఇవ్వడం చాలా శుభప్రదంగా భావిస్తారు అని పండితులు చెబుతున్నారు.మరికొందరు ఏమో ఇప్పుడు వచ్చే సంక్రాంతి చాలా చెడ్డది అని, చాలామందికి విషాదాన్ని మిగిలిస్తుందని, పరిహార పూజలు చేయకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
DEVOTIONAL