దీపావళి పండుగ కు ముందు రోజు వచ్చే ధన త్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆ రోజున అందరూ లక్ష్మీ దేవిని పూజించి, బంగారం, వెండి నగలను కొనుగోలు చేస్తుంటారు.
ధన్ తేరస్ రోజు నగలు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని ఎప్పటినుంచో మన పూర్వీకులు నమ్ముతున్నారు.అక్టోబరు 23న ధన్ తేరస్ రోజున జ్యోతిష్యపరంగా కీలక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది.
శని గమనంలో మార్పుల వల్ల మూడు రాశుల వారికి ఊహించని విధంగా అదృష్టం కలిగే అవకాశం ఉంది.
వృషభం రాశి వారికి మకరరాశిలో శని సంచారం వృషభ రాశి వారికి శుభాలను కలిగించే అవకాశం ఉంది.
ధన్‌తేరస్ రోజు నుంచి అదృష్టం పెరుగుతుంది.మీరు ఏ పని చేసినా విజయం సాధించే అవకాశం ఉంది. డబ్బుకు, తిండికి లోటు అస్సలు ఉండదు.ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభం ఉంటాయి.
మిథునం రాశీ వారికి శని గ్రహ మార్గి వల్ల మిథున రాశికి అనేక బాధల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది.కొంత కాలంగా వేధిస్తున్న వ్యాధులు తగ్గడం వల్ల వీరి కష్టాలు తొలగిపోతాయి.
మీ శత్రువు బలహీనంగా మారే అవకాశం ఉంది.కొత్త స్నేహితులు, సంబంధాలు ఏర్పడతాయి.
ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
వీరికి ఒత్తిళ్లు తగ్గిపోతాయి.
కర్కాటక రాశి వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు.భార్యాభర్తల మధ్య అనుబంధం ఎంతో బలంగా ఉంటుంది.ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారికి అధిక లాభం వచ్చే అవకాశం ఉంది.మీ పిల్లల నుంచి ఆనందాన్ని పొందుతారు.
కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.కుటుంబంలోని గొడవలు తగ్గి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉంటారు.
ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది.