Basil leaves : గంగాజలన్నీ తులసి ఆకులను పూజలో ఉపయోగించడానికి గల కారణాలు తెలుసా..

మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలలో ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి పూజలు కూడా చేస్తూ ఉంటారు.

 Do You Know The Reasons Why All The Ganges Use Tulsi Leaves In Puja ,  Puja, Tul-TeluguStop.com

ఆ పూజలలో ఖచ్చితమైన కొన్ని వస్తువులను ఉపయోగించాలని నియమం ఉంటుంది.అలాంటి వస్తువులను ఎంతో జాగ్రత్తగా పవిత్రంగా ఖచ్చితమైన ఒక ప్రదేశంలో ఉంచి దేవాలయానికి తీసుకురావాలి.

చాలా రకాల పూజల లో గంగాజలాన్ని, తులసి ఆకులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు.ఎందుకంటే దేవుళ్లకు పూజలు చేసేటప్పుడు ఈ రెండు కచ్చితంగా ఉండాల్సిందే.పూజ పళ్లెంలో నైవేద్యాలను అమర్చడానికి తులసి ఆకులు కచ్చితంగా ఉండాల్సిందే.సనాతన ధర్మంలోని అన్ని పూజలలో గంగా జలానికి ప్రత్యేకమైన పాత్ర కచ్చితంగా ఉండాలి.

తులసి గంగాజలం చాలామంది ప్రజలు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.చాలా మంది ప్రజలు తులసి ఆకులు గంగాజలంతో అనేక ఆచారాలను కఠినంగా పాటిస్తారు.

కానీ పూజ సమయంలో ఈ రెండు ఎందుకు తప్పనిసరి అనే విషయం చాలామందికి తెలియదు.దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bakti, Basil, Devotional, Lord Vishnu, Puja, Tulsi-Latest News - Telugu

గంగా జలాన్ని భగవంతుని ప్రసాదం, చరణామృతం అని చాలామంది భక్తులు చెబుతూ ఉంటారు.తులసి ఆకులు లేనిదే పూజ అసలు పూర్తికాదు.పూజా సమయంలో గంగాజలంలో తులసి ఆకులు కూడా వేస్తారు.సనాతన ధర్మం ప్రకారం తులసి ఆకులు ఎంతో పవిత్రమైనవి.ఆ ఇంట్లో తులసి మొక్క ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుందని నమ్మేవారు ఉన్నారు.దీనితో పాటు మహావిష్ణువు ఆశీర్వాదం కూడా లభిస్తుందని గట్టి నమ్మకం.

గంగా జలం తులసి ఆకులతో కలిసిన నీటిని రాగి పాత్రలో ఉంచితే ఆ నీరు అమృతం లాగే స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుందని చాలామంది నమ్మకం.అందుకే చాలామంది పంచామృతానికి బదులుగా గంగాజలం తులసి ఆకులను కూడా ఇస్తూ ఉంటారు.

సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను ముట్టుకోవడం అంత మంచి విషయమేమీ కాదు.తులసి దేవి ఎప్పుడు పరిశుభ్రతను ఎక్కువగా ఇష్టపడుతుంది.

అంతేకాకుండా మంగళ, ఆదివారాలలో తులసి మొక్కను ముట్టుకోకూడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube