కాకతీయులనాటి శ్రీ ఆది మహావిష్ణువు ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు.. ఏ ఉత్సవాలకంటే..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలోని శ్రీ ఆది మహావిష్ణువు దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎంతో ఘనంగా, వైభవంగా జరుగుతున్నాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి భారీగా తరలివచ్చారు.

 Devotees Flocking To Sri Adi Mahavishnu Temple Of Kakatiya Days.. More Than An-TeluguStop.com

ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆది మహావిష్ణువు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడని చాలామంది భక్తులు విశ్వసిస్తున్నారు.వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణువు గరుడ వాహనం పై నుండి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు.

కాబట్టి ఆ రోజును ముక్కోటి ఏకాదశి అని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశు లతో సమానమైన పవిత్రతను సంతరించుకోవడం వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా చెబుతూ పిలుస్తూ ఉంటారు.అంతే కాకుండా చౌటుప్పల్ దేవలమ్మ నాగారం గ్రామంలో పూజలు అందుకుంటున్న ఈ ఆది మహావిష్ణువుకు ఒక ప్రత్యేకత ఉంది.2015వ సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలు పని నిమిత్తం తవ్వుతుండగా ఆ తవ్వకాల్లో ఈ విష్ణుమూర్తి విగ్రహం లభించింది.ఈ విష్ణు మూర్తి విగ్రహం కాకతీయుల కాలం నాటి విగ్రహంగా పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు.అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు నుండి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి స్వామివారికి కళ్యాణం జరిపిస్తారని ఆలయ కమిటీ ప్రముఖులు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు.ఇలా భారీగా వచ్చే భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ వారు పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube