మనదేశంలో చాలామంది ప్రజలు సంఖ్యా శాస్త్రాన్ని కూడా బాగా నమ్ముతారు.కొన్ని సంఖ్యల వల్ల కొంతమంది వ్యక్తుల జీవితాలలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
అలాగే పుట్టినరోజు కొన్ని సంఖ్యల ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కొక్క ప్రభావం ఉంటుంది.కొన్ని సంఖ్యల ప్రభావం వల్ల ఎదురు కాబోయే పరిస్థితులను న్యూమరాజలలజీ నిపుణులు అంచనా వేస్తూ ఉంటారు.
అలాగే పుట్టిన తేదీలో ఆరు సంఖ్య వస్తే వారిపై ఆ సంఖ్య బల బలహీనతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఆరు అనే సంఖ్య శుక్ర గ్రహాన్ని సూచిస్తుంది.
అయితే ఆరు ఎక్కువగా ఉంటే కుటుంబ జీవితంలో ఇబ్బందులు, అవకాశాలు లేకపోవడం వంటి పరిస్థితి ఎదురవుతాయి.ఈ సంఖ్య లక్కీ కలర్స్ గా బ్లూ, పింక్ రంగులు ఉంటాయి.
శుక్రవారం రోజు చేపట్టిన పనులకు అదృష్టం ఎప్పుడు ఉంటుంది.ఇలాంటివారు అదృష్ట సంఖ్యగా ఐదు, ఆరు భావించడం మంచిది.
పుట్టిన తేదీలో 6 అనే సంఖ్య ఉంటే అలాంటివారు ఎంతో తెలివిగలవారు.వీరికి కొత్తగా ఆలోచించే నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది.
వీరు పని మొదలు పెడితే ఒక ప్రణాళిక బద్ధంగా చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.విరు కుటుంబ పరంగా అయినా బాధ్యతగా ఉంటారు.
వీరికి కొత్తగా క్రియేట్ చేసే నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది.సమాజం దేశం పట్ల వీరు ఎక్కువగా బాధ్యతగా ఉంటారు.
వీరికి దైవభక్తి కూడా ఎక్కువే.ఇతరులకు ఎంత సాయం చేయడానికి అయినా ముందుకు వచ్చే మనసు వీరి సొంతం.

అయితే పుట్టినరోజులో ఆరు అనే సంఖ్య ఉన్నవారు ఓవర్ ఫ్లెక్సిబుల్ స్వభావం కారణంగా ఇతరులు ఎక్కువగా వీరిని ఉపయోగించుకుంటారు.ఇలాంటి వ్యక్తులు ఒంటరితనం అంటే ఎక్కువగా భయపడుతూ ఉంటారు.వీరికి సౌందర్య సాధనాలు, రత్నాల తయారీ, బ్యూటీ ప్రొడక్ట్స్, బ్యూటీషియన్స్, డిజైనర్స్, ఆభరణాలు వస్త్రాలకు సంబంధించిన రంగంలో వీరు చక్కగా రాణించే అవకాశం ఉంది.