ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.48
సూర్యాస్తమయం: సాయంత్రం 06.12
రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 ల3.30 సా6.00
దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.3వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.
వారితో కొంత సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో అనుకూలంగా ఉంది.
వృషభం:

ఈరోజు మీరు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మిథునం:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారం విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
కర్కాటకం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడిన వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకండి.
సింహం:

ఈరోజు మీరు పనిచేసే చోట ఒత్తిడి అధికమవుతుంది.పై అధికారులతో చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడమే మంచిది.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారిని విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.
కన్య:

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచూ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
తులా:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
ధనస్సు:

ఈరోజు మీకు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
మకరం:

ఈరోజు మీకు బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే ఉద్యోగంలో గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కుంభం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీనం:

ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
DEVOTIONAL